టీడీపి కి బిగ్ షాక్..కారణం ఇదే

నంద్యాలలో మా పార్టీ గెలిచిందోచ్ అని తెగ సంబరపడిపోతున్న టీడీపికి నాయకులకి విశ్లేషకుల   మాటలు విని ఒకింత షాక్ అయ్యారు. గెలుపు ఆనందంలో ఉన్న వాళ్ళు ఒకేసారి ఆలోచనలో పడ్డారు. ఇంతకీ రాజకీయ విశ్లేషకులు ఏమి  చెప్పారు .

ఎలాంటి ఉప ఎన్నికలు అయినా సరే, అవి  ఎక్కడ జరిగినా, అక్కడ ఉన్న  అధికార  పార్టీలు విజయం సాధించడం పెద్ద విషయం ఏమి  కాదు. దశాబ్దాల రాజకీయ చరిత్రను చూస్తే.. ఎప్పుడో తప్ప ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు బోల్తా పడిన దాఖలాలు కనిపించవు. జగన్ కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో , ఉప ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు, పద్దెనిమిది మంది  ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెచ్చిన సందర్భాలను తప్పిస్తే. ఏపీలో కూడా ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అధికారంలో ఉన్న వారిదే విజయం అయ్యింది. మళ్ళి అదే పరిస్థితి  ఇప్పుడూ జరిగి నంద్యాలలో తెలుగుదేశం కి అనుకూలంగా రిజల్ట్స్ వచ్చాయి.

tdp leaders big shock కోసం చిత్ర ఫలితం

నంద్యాలతో పాటు విడుదల అయిన ఇతర నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు గమనిస్తే.తెలుగుదేశం ఆనందం ఆవిరి అవుతోంది. దేశంలో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో ఒకటి, గోవాలో రెండు స్థానాలు, ఏపీలో ఒకటి. ఏపీలో అధికార టీడీపీ గెలిచింది. ఢిల్లీలో అధికార ఆప్ గెలిచింది. గోవాలోని రెండు స్థానాలనూ అధికార బీజేపీ సొంతం చేసుకుంది. అలాగే ఏపీలో కూడా టీడీపీ గెలిచింది  సో  దీని ప్రకారం ఉప ఎన్నికల ఫలితాలనేవి అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వస్తాయని చెప్పడానికి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగిన బై పోల్స్ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.ఈ విశ్లేషణ తో టీడీపి వర్గాలలో ఉన్న విజయం తాలూకు సంతోషం ఒక్కసారిగా ఆవిరి అయ్యింది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *