వీళ్ళ వలన టీడీపికి 20 వేల ఓట్లు నష్టం…

నంద్యాల ఉపఎన్నికలు అనగానే చంద్రబాబు నాయుడు తనకున్న రాజకీయ అనుభవంతో వ్యూహాలు రచించి నంద్యాల సామాజిక వర్గాల ప్రజలని తమవైపు తిప్పుకునేందుకు ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కొక్కరిని దించుతూ వారికి పదవులు కట్టబెడుతూ ఓటర్లని టీడీపి కి అనుకూలగా మలచుకునే ప్రయత్నం చేశాడు.ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి అక్కడే ఇఫ్తార్ విందును నిర్వహించడం, ఫరూక్ కు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం. ఆ తర్వాత వైశ్య సామాజికవర్గానికి చెందిన టీజీ లాంటి వాళ్లను దించడం.. ఇదంతా కులాల లెక్కనే జరిగింది. ఇక రెడ్ల సామాజికవర్గాల జనాభా కూడా భారీగానే ఉంది.  ఈ నేపథ్యంలో వాళ్లను ఆకట్టుకోవడానికి ఐదారు మంది నేతలను రంగంలోకి దించారు బాబు.

వారే కర్నూలు పక్క జిల్లాలకు చెందిన మంత్రులు ఆదినారాయణ రెడ్డి, అమరనాథ రెడ్డి. వీళ్లకు తోడు అఖిలప్రియ. వీళ్లంతా రెడ్డి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రంగంలోకి దిగిన వాళ్లే. మరి వీళ్లంతా దాదాపు “ఇరవై వేల” వరకూ ఉన్న రెడ్డి ఓట్లను ఆకర్షించడమే పనిగా పెట్టుకుని మాట్లాడుతున్నారు.వీరితో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడ ప్రచారంలో ఉన్నారు.అసలు విషయంలోకి వెళ్తే వీళ్ళందరు పనిగట్టుకుని ఎంతసేపూ జగన్ పై విరుచుకుపడటమే. జగన్ ను తిడుతూ ఉండటమే. మరి ఒక రెడ్డి సామాజికవర్గానికి చెందినా ఓట్ల కోసం జగన్ మీద ఇలా ఉన్నవీ లేనివి చెప్పుకుంటూ పొతే భూమా వర్గానికి ఉండే కొన్ని సానుభూతి  ఓట్లు కూడా పడేటట్టుగా లేదు.

ఇప్పుడు జగన్ పై అభియోగాలు చేస్తూ విమర్శిస్తున్న ఆదినారాయణ రెడ్డి, అమరనాథరెడ్డి, అఖిలప్రియ వీళ్ళు అందరూ వైకాపా తరపునే గెలిచి పదవులకోసం పార్టీ మారి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు అని నంద్యాల ప్రజలు తిట్టి పోస్తున్నారు.ఇప్పుడు టీడీపికి జగన్ మీద విమర్శలు చేసే ఈ రెడ్లందరి వలన నష్టమే కానీ లాభం చేకూరే అవకాశమే లేదు

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *