“పీజీ – ఈసెట్ ”..రేపటి నుంచే..
ఇంజనీరింగ్ , ఫార్మసీ , టెక్నాలజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకి ఈ నెల 28 నుంచీ 31 వరకూ తెలంగాణ పీజీ ఈసెట్ నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు విడతల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది.

హైదరాబాద్ లో 12 పరీక్ష కేంద్రాలు, వరంగల్ లో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా పీజీ ఈసెట్ కన్వీనర్ ఆచార్య ఎం.కుమార్ తెలిపారు. ఈ సెట్ కి సుమారు 20,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, ఒక్క నిమిషం నిభందన అమలులో ఉన్నందున విద్యార్ధులు జాగ్రత్త వహించాలని తెలిపారు.