బిగ్ బాస్ గొంతు ఎవ‌రితో తెలుసా…

తెలుగు బుల్లితెర మీద ఫ‌స్ట్‌టైం ప్ర‌సారం అవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. తొలి ఐదు రోజులు వీక్ అయినా వీకెండ్స్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వ‌డం, జ్యోతి బిగ్ బాస్ నుంచి అవుట్ అయిన తొలి కంటెస్టెంట్ కావ‌డంతో షోపై జ‌నాల్లో ఇప్పుడిప్పుడే క్యూరియాసిటీ పెరుగుతోంది. కంటెస్టెంట్ల వ‌ల్లే షో వీక్ అయ్యింద‌న్న విమర్శల నేపధ్యంలో కాస్త మసాలా డోస్ పెంచే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. షోలో వీళ్ళందరితో పాటు మరొక ఆకర్షణీయమైన అంశం ఏంటంటే  అందరికి ఆర్డర్లు జారీ చేస్తోన్న వాయిస్ ఒక‌టి వెన‌క‌నుంచి వినిపిస్తోంది. ఈ వాయిస్ ఎన్టీఆర్‌ది కాదు.
మ‌రి ఇప్పుడు ఈ గొంతు ఎవ‌రిదా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను నెల‌కొంది. హిందీ బిగ్ బాస్ షోకు అతుల్ క‌పూర్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. ఆయ‌న ప్ర‌ముఖ ఆర్టిస్ట్‌, డ‌బ్బింగ్ స్పెష‌లిస్టు. 2002 నుంచి ఇదే రంగంలో ఉన్నాడు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ షోకు ఎవ‌రు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారా ?  అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ వ‌చ్చేసింది.
తెలుగు బిగ్ బాస్ కి గొంతు అరువు ఇచ్చింది రాధా కృష్ణ అని తెలిసింది. ఇతను ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇక తెలుగు బిగ్ బాస్‌కు రాధాకృష్ణ‌తో పాటు శంక‌ర్ కూడా డ‌బ్బింగ్ విష‌యంలో హెల్ఫ్ చేస్తున్న‌ట్టు టాక్‌. శంకర్ మా టీవీ లో వచ్చిన సీఐడీ సీరియల్ కు డబ్బింగ్ చెప్పేవాడు. సినిమాల ద్వారా కూడా అందరికి పరిచయమే .
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *