అస్వస్థకు గురైనా నటుడు సునీల్…!! ఆందోళనలో అభిమానులు…!!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హీరో సునీల్ తీవ్ర  అస్వస్థతకు గురయ్యారు. కమెడియన్ గా తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న సునీల్, అందాల రాముడు సినిమా తో హీరోగా కనిపించారు. ప్రస్తుతం ఆయన గొంతు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్  కారణంగా అనారోగ్యానికి గురై, గచ్చిబౌలి లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు.

సునీల్ తన  కామెడీ టైమింగ్, డాన్స్ తో తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి మర్యాదరామన్న చిత్రంతో హీరోగా తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. హీరోగా విజయాలతో ముందుకెళ్ళిన సునీల్, కొంతకాలంగా మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. ఈ మధ్యకాలంలో మళ్ళి తెరమీద కనిపిస్తూ ఆయన అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నారు. కాగ, ఈ విషయాన్నీ తెలుసుకున్న సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *