శివాజీ లీక్స్ – ఏపీ పై మరో కుట్ర అదేంటంటే..!!!!

సినిమాలో అవకాశాలు లేక..కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ నటుడు శివాజీ గతకొంత కాలంగా వివిధ పార్టీలకి డప్పు కొడుతూ చివరికి చంద్రబాబు పార్టీలోనే అనధికారికంగా చేరిపోయారు..గతంలో  చంద్రబాబు ని అమ్మనా బూతులు తిట్టిన పని చేసిన శివాజీ ఇప్పుడు బాబు పై ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా పార్టీ అధికార ప్రతినిధికే కళ్ళు బైర్లు కమ్మేలా కొమ్ము కాస్తున్నారు ఇప్పుడు శివాజీ ఏకైక టార్గెట్ బీజేపీ ,జనసేన,వైసీపీ ఈ మూడిట్లో చోటు దక్కని శివాజీ ఇప్పుడు ఈ మూడు పార్టీలని ఏకడమే పని గా పెట్టుకున్నారు..సరే ఇదంతా అందరికి తెలిసిందే శివాజీ లీక్స్ లోనుంచీ బయటకి వచ్చిన మరొక అంశం ఏమిటంటే..

Image result for sivaji tollywood hero press meet

ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నోటీసుల అందబోతున్నాయంటూ అప్పట్లో ప్రకటించి వికీ లీక్స్ లాగా శివాజీ లీక్స్ పేరుతో సంచలనాలు సృష్టిస్తున్న శివాజీ తాజాగా మరొక సంచలన ప్రకటన చేశాడు..త్వరలో ఏపీలో అల్లర్లకు కుట్రపన్నుతున్నారు బీ అలెర్ట్ అంటూ హెచ్చరికలు చేశాడు.  అంతేకాదు ఐటీ దాడులపై ఏమి మాట్లాడితే ఎవరు మనల్ని టార్గెట్ చేస్తారోనని టీడీపీ నేతలు అందరూ  భయపడి చస్తుంటే “నేనున్నాను” అంటూ నాగార్జున లా ఎంట్రీ ఇచ్చి మరీ  ఆభాద్యతని భుజాన  వేసుకున్నాడు.

Image result for sivaji tollywood hero press meet

అయితే శివాజీ ప్రెస్ మీట్ పెట్టి ఏమి చెప్తాడా అనుకున్న జర్నలిస్ట్ సోదరులతో…ఏపీలో జరుగుతున్న ఐటీ దాడుల లక్ష్యం  చంద్రబాబే అంటూ ప్రకటన చేశాడు దాంతో కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు లేదంటే పోతామని అన్నట్లుగా విలేఖరులు మొఖాలు పెట్టడంతో తడుముకోకుండా ఏపీలో అల్లర్లు చెలరేగుతాయి బీ అలెర్ట్ అంటూ ఏపీ ఇంటలిజెన్స్ అస్సలు పనికిరాని సంస్థలా తయారయ్యింది అన్నీ నాకే ముందు తెలుస్తున్నాయి అనే బిల్డప్ ఇస్తూ ఇంటలిజెన్స్ వ్యవస్థ కంటే శివాజీనే బెటర్ అనే రేంజ్ లో ప్రజలు అనుకునే లా చేస్తున్నాడు మొత్తానికి శివాజీ వలన టీడీపీ కి పెద్ద ప్లస్ కంటే అతిపెద్ద మైనస్ బాగా కనిపిస్తోందనేది పలువురు విశ్లేషకుల వాదన..,

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *