బిడెన్ అధ్యక్షుడైతే “కాశ్మీర్” పై ఆశలు వదులుకోవాల్సిందేనా

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ఎంపిక దాదాపు ఖరారే. ట్రంప్ ఓటమి చెందిన మాట కూడా వాస్తవమే మరి ఈ ఎన్నికల్లో గెలుపొందిన బిడెన్ భారత్ కు ఎలాంటి మద్దతు ఇస్తాడు, బిడెన్ ప్రభావం భారత్ పై ఎలా ఉండబోతోంది అనే విషయాలలో ప్రస్తుతం ప్రతీ భారతీయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ భారత్ పై చూపించినంత ప్రేమ బిడెన్ కు ఉండదని అంటున్నారు పరిశీలకులు. అందుకు గల కారణాలు ఏమిటి…???

Vice President Joe Biden in Pakistan today to meet with nation's leaders - cleveland.com

భారత్ కు శత్రు దేశాలు ఎవన్నా ఉన్నాయంటే అవి చైనా, పాకిస్థాన్ అని నిక్కర్లు వేసుకునే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. ఈ రెండు దేశాలు భారత్ పై తోక జాడించిన ప్రతీ సారి ట్రంప్ భారత్ కు మద్దతుగా నిలిచారు. భారత్ పై దూకుడు ప్రదర్సిస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ బిడెన్ అలా కాదు.

Biden likely to continue with Trump's India policy - The Sunday Guardian Live

బిడెన్ ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలో పాకిస్తాన్, చైనాలతో ఎంతో స్నేహ భందాన్ని నెరిపాడు. ముఖ్యంగా చైనాతో ముందు నుంచీ బిడెన్ కు ఆర్ధిక పరమైన లావాదేవీలు ఉండటంతో పాటుగా భారత్ చైనా సరిహద్దు విషయంలో ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరించారు. అంతేకాదు భారత్, పాక్ ల మధ్య కాశ్మీర్ విషయంలో సైతం బిడెన్ వేలు పెట్టడానికి ప్రయత్నించాడు, ఉపాధ్యక్ష హోదాలో భారీ ఆర్ధిక సాయం చేశారు. భారత్ ప్రభుత్వం అమలు చేసిన ఆర్టికల్ 370 ని వ్యతిరేకించి పాక్ కు మద్దతుగా నిలిచాడు. ఈ పరిణామాల నేపధ్యంలో బిడెన్ భారత్ కు అండగా ఉంటారనేది ఊహలకు మాత్రమే పరిమితమని, కాశ్మీర్ విషయంలో కూడా వేలు పెట్టి పాక్ కు మద్దతు తెలిపుతాడని అంటున్నారు విశ్లేషకులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *