వైసీపీలోకి టీఎస్సార్‌… బాబాయ్‌కు జ‌గ‌న్ షాక్‌

2019 ఎన్నికల విషయంలో జగన్ మోహన్ రెడ్డి చాలా స్పీడ్ నిర్ణ‌యాల‌తో ముందుకు వెళుతున్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం మాత్ర‌మే ఉండడంతో జ‌గ‌న్ పీకే స‌ల‌హాల‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఏయే నియోజకవర్గాల్లో ఎవరిని పోటీ చేయించాలి ? అనే అంశంపై జగన్ వరసగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

ఈ క్ర‌మంలోనే ప‌లువురు కీల‌క‌నేత‌ల‌ను త‌న పార్టీ నుంచి బ‌రిలోకి దింపేలా పెద్ద ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ సీటు నుంచి సూప‌ర్‌స్టార్ కృష్ణ సోద‌రుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును, గుంటూరు నుంచి ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవ‌రో ఒక‌రిని పోటీ చేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇక ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ టి.సుబ్బ‌రామిరెడ్డిని కూడా త‌న పార్టీలో చేర్చుకుని ఆయ‌న్ను విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయించాల‌ని జ‌గ‌న్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సుబ్బ‌రామిరెడ్డిని పార్టీలోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ఇక ఇదే టైంలో జ‌గ‌న్ మ‌రో షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైవి.సుబ్బారెడ్డిని ప‌క్క‌న పెట్టేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సుబ్బారెడ్డి సేవలను ఎంపీగా కాకుండా.. పార్టీకి ఉపయోగించుకోవాలని సమాచారం.

సుబ్బారెడ్డికి పార్టీ తరపున ఒక పదవిని ఇస్తూ.. కొన్ని బాధ్యతలను అప్పగిస్తూ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు నుంచి మరో వ్యక్తిని బరిలోకి దించనున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా 2019లో ఎట్టిప‌రిస్థితుల్లో గెల‌వాల‌న్న ఉద్దేశంతో జ‌గ‌న్ ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

 

Also Read :http://www.telugustarnews.com/telugu/tdp-mlcs-ready-to-left-the-party-soon/

టీడీపీకి ఇద్ద‌రు ఎమ్మెల్సీలు గుడ్ బై..!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *