డ్ర‌గ్స్ ఇష్యూలో ఎస్కేప్ అయిన టాప్ హీరోలు వాళ్లిద్ద‌రే

డ్రగ్స్ భూతం టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేస్తోంది. తెలుగు సినీ నటులపై ఉన్న గౌరవాన్ని దిగజార్చే విధంగా కొందరు సినీ ప్రముఖుల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో బయటికొచ్చాయి. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామేన్‌ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, తనీష్‌, కేరక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.
ఈ లిస్టులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇప్ప‌టి వ‌ర‌కు 12 మందికి నోటీసులు జారీ చేయ‌గా, మ‌రో 7 గురికి నోటీసులు జారీ చేయ‌క‌పోవ‌డం ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిస్తోంది. ఈ 7 గురిలో ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రి తండ్రులు టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత‌లు కావ‌డంతో వీరి పేర్లు బ‌య‌ట‌పెట్టే విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.
ఇక ఈ జాబితాలోనే సినిమా ఫంక్ష‌న్ల‌లో హీరోల‌ను మోసేసే ఓ బ‌డా బినామి నిర్మాత కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక పూరి గ్యాంగ్‌కే చెందిన మ‌రో వ్య‌క్తి పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. అయితే రెండో లిస్టులో అగ్ర నిర్మాత‌ల త‌న‌యులు ఉండ‌డంతో… అధికారుల‌పై తీవ్ర‌మైన రాజ‌కీయ ఒత్తిళ్లు ఉండ‌డంతో వీరి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని స‌మాచారం.
ఈ ఇద్ద‌రు అగ్ర హీరోల తండ్రులు బ‌డా నిర్మాత‌లు. వీరిలో ఓ హీరో ఓ ముదురు హీరోయిన్‌తో ఘాటుగా ఎఫైర్‌న‌డిపి చాలాసార్లు ప‌బ్లిక్‌గానే దొరికిపోయాడు. ఇక మ‌రో అగ్ర హీరో నిర్మాతకు ఇప్ప‌టికే పెళ్లి కూడా అయ్యింది. అత‌డు కూడా సీక్రెట్ డ్ర‌గ్గిస్ట్ అని టాక్‌.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *