మాస్క్ పెట్టుకోలేదని చేతుల్లో మేకులు దింపిన పోలీసులు….

కరోనా మహమ్మారి చెలరేగి పోతున్న తరుణంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలతో కూడిన కర్ఫ్యూ విధించిన విషయం విధితమే దాదాపు అన్ని రాష్ట్రాలలో ఈ కర్ఫ్యూ విధించారు. అయితే నిభందనలు అతిక్రమించి వీధుల్లో తిరుగుతున్నా వారికి పలు రకాలుగా జరిమానాలు విధిస్తూ పోలీసులు తమ తరహాలో బుద్ధి చెప్తుంటే కొందరు పోలీసులు మాత్రం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని ప్రజా సంఘాలు ఘోల్లు మంటున్నాయి.

3 stories of UP police's raid: Nail in Bareilly wearing a mask in his hands  and feet; In Rae Bareli, 5 youths were kept in the post and beaten  overnight, and in

సమయాభావం అయిన తరువాత ప్రజలు బయటకు వస్తే బండి సీజ్ చేయడం, జరిమానా విధించడం పరిపాటే..కొన్ని చోట్ల వీపులు విమానం మోత మోగిస్తున్నారు పోలీసులు. కానీ యూపీ లో తాజాగా జరిగిన సంఘటన అందరిని షాక్ కు గురి చేసింది. మాస్క్ పెట్టుకోలేదని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి చేతిలో, కాళ్ళల్లో మేకులు దించేశారు. ఈ వార్త యూపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Police excess! Bareilly Police hammer nails into youth's hands, feet for not  wearing mask

యూపీ లో రాత్రి సమయంలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ యువకుడు మాస్క్ లేకుండా కనిపించాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడగగా ఇంటి బయట ఉన్నాను కదా మాస్క్ ఎందుకు అంటూ అతడు వారించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన పోలీసులు యువకుడిని స్టేషన్ కు తీసుకువెళ్ళి చేతి, కాళ్ళలో మేకులు దించి ఉదయం ఇంటికి పంపారు. ఈ విషయంపై తల్లి తండ్రులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎస్పీ అతడిపై పలు కేసులు ఉన్నాయని అందుకే పోలీసులు తీసుకువెళ్ళి విచారణ చేపట్టారని అన్నారు. ఎంత విచారణ చేపట్టినా చేతిలో మేకులు దించాలా అంటూ నిరసనకు దిగారు భాదితుడి తల్లి తండ్రులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *