భారత్ కే మా మద్దతు.. చైనా దిమ్మ తిరిగిపోయిందిగా…!!

చైనా భారత్ పై చేస్తున్న వికృత చర్యలు ఎప్పటి కప్పుడు అన్ని దేశాలు గమనిస్తూనే ఉన్నాయి. లడాఖ్ లోని వస్తవాదీన రేఖ వద్ద చైనా చేస్తున్న కవ్వింపు దూకుడు చర్యలను సహించేది లేదని అమెరికా నూతన ప్రభుత్వం ప్రకటించింది. బిడెన్ నాయకత్వంలో ఎన్నికైన ప్రభుత్వం అతి త్వరలో పూర్తి స్థాయి అధికారాలను చేపట్టడానికి సిద్దంగా ఉన్న తరుణంలో అమెరికా ఆర్ధిక మంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న ఆంటోని బెంక్లిన్ చైనా దూకుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు..

Biden Must Repair—and Reinvigorate—Tech Diplomacy | WIRED

చైనా తన హద్దులు మీరుతోందని, భారత్ లోని వాస్తవాదీన రేఖ వద్ద అలాగే ప్రపంచ దేశాలపై  ప్రదర్శిస్తున్న దూకుడు ని కట్టడి చేయాల్సిందేనని అందుకు భారత్ మద్దతు కావాలని, ఇరు దేశాల ఉమ్మడి సవాల్ చైనా ని కట్టడి చేయడమేనని, భారత్ తో బిడెన్ మరింత స్నేహ భావంతో ఉండటానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. బెంక్లిన్ చేసిన ఈ వ్యాఖ్యలతో భారత్ – అమెరికా మధ్య సంభందాలపై బిడెన్ వైఖరి ఎలా ఉండబోతోందనేది అర్థమవుతోందని అంటున్నారు నిపుణులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *