kamala harris next us president chances

ఏడాదిలోనే “కమలా హరీస్” అధ్యక్షురాలు కాబోతోందా..??

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై ఘన విజయం సాధించిన బిడెన్ త్వరలో అద్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నాడు. ఈ తరుణంలో అతి త్వరలో బిడెన్ పాలన పోయి సంవసత్సరంలోగానే మన కమలా హారీస్ పాలన వస్తుందని, అగ్ర రాజ్యం అమెరికాకు కమలా హారీస్ అధ్యక్షురాలు అవుతారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన ట్వీట్ చేశారు.

అమెరికా భవిష్యత్తు ప్రెసిడెంట్ మన కమలా హరీస్ అవుతుందని జోస్యం చెప్పింది కంగనా. జో బిడెన్ ఓ గజినీ లాంటి వాడని, ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచినా ఏడాదిలో పాలన మొత్తం కమలా హరీస్ చేతిలోకి వెళ్ళిపోతుందని అన్నారు. ప్రతీ ఐదు నిమిషాలకు విషయాలు మరిచిపోయే వ్యాధి బిడెన్ కు ఉందని కంగానా ఆరోపించారు. ఏది ఏమైనా భారత మూలాలు ఉన్న  కమలా హరీస్ అధ్యక్షురాలు అవుతారనే వార్త అందరిని సంతోష పెడుతోందనడంలో సందేహం లేదు. మరి మీరేమంటారు..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *