అమెరికా వెళ్ళే విద్యార్ధులకు గుడ్ న్యూస్…విద్యార్ధులు బీ అలెర్ట్…!!

అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని ఏ విద్యార్ధికి ఉండదు చెప్పండి. అక్కడ చదువు పూర్తి కాగానే అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడి అమెరికాలో శాశ్వత నివాసం పొందాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా సిద్దమవుతారు. కానీ చాలా మందికి ఇంటర్వ్యూ లోనే సమస్య ఎదురవుతుంది. ఇంటర్వ్యూ సరిగా ఫేస్ చేయలేకపోవడం కారణంగా ఎంతో మంది వీసాలు రిజక్ట్ అవుతాయి. దాంతో మళ్ళీ ఇంటర్వ్యూ కి హాజరు అవ్వడానికి చాలా కాలం పడుతోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో తాజాగా

Immigration Services In Thailand | 1Visa Consulting Co., Ltd

అమెరికా ప్రభుత్వం ఒకసారి ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయిన వారికి మరో దఫా ఇంటర్వ్యూ కి హాజరయ్యేందుకు వీలు కల్పిస్తోంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన కూడా చేసింది. మొదటి సారి ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యిన వారు మరో సారి ఇంటర్వ్యూ కి హాజరయ్యి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చునని తెలుస్తోంది. ఇదిలాఉంటే

Various types of student visa for studying in US - Telangana Today

గడిచిన ఏడాది ఒక్కో విద్యార్ధి ఒక్కసారి మాత్రమే ఇంటర్వ్యూ కి హాజరయ్యేలా నిభందన విధించిన తాజాగా ఈ మార్పులు చేయడంతో అమెరికా వెళ్లి చదువుకోవాలని ఆరాటపడుతున్న ఎంతో మంది విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చే నెలలోనే వీసా ఇంటర్వూ స్లాట్లు ఇవ్వాలని భావిస్తోంది భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం. దేశంలోని ముఖ్యమైన ఐదు నగరాలలో ఈ రెండవ దఫా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారట. ముంబై, ఢిల్లీ, హైదరబాద్, కలకత్తా లలోని అమెరికా కార్యాలయాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అయితే విద్యార్ధులు ఈ విషయంలో అలెర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు పరిశీలకులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *