” V ” : రివ్యూ

టైటిల్ : V

నటీనటులు : నాని, సుదీర్ బాబు, నివేద ధామస్ తదితరులు..

నిర్మాత : దిల్ రాజు

దర్శకత్వం : ఇంద్రగంటి మోహన్ కృష్ణ

రన్ టైం : 2.20

రిలీజ్ డేట్ : 05-సెప్టెంబర్ -2020

మ్యూజిక్ : త్రివేది , తమన్

 

న్యాచురల్ స్టార్ నాని, సుదీర్ బాబు కాంబో లో వచ్చిన  v సినిమా మార్చి 25వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పట్లో ధియాటర్స్  తెరుచుకునే అవకాశం లేకపోవడంతో చివరికి అమెజాన్ ప్రైమ్ లో సినిమాని రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా, మోహన్ క్రిషన్ దర్సకత్వంలో ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ తెలుగు స్టర్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం..

 

కధ :

ఈ సినిమాలో నాని పేరు విష్ణు, ఆర్మీలో పనిచేసిన విష్ణు ప్రసాద్ అనే వ్యక్తిని చంపుతాడు. ఈ క్రమంలోనే మరో నలుగురిని కూడా చంపుతానని డీసీపీ ఆదిత్య (సుదీర్ బాబు) కు సవాల్ విసురుతాడు.ఆదిత్య కూడా విష్ణు సవాల్ ని స్వీకరిస్తాడు. ఈ క్రమంలోనే అపూర్వ (నివేద ధామస్ ) ఆదిత్య తో ప్రేమలో పడుతుంది. అసలు విష్ణు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, హత్యలు జరగకుండా ఆదిత్య ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు అనేది ఈ సినిమా చుట్టూ తిరుగుతుంది.

It's Pawan Kalyan's music director for Nani's 'V' - Telugu News -  IndiaGlitz.com

విశ్లేషణ :

న్యాచురల్  స్టార్ గా పేరున్న నాని ఈ సినిమాలో తన సహజసిద్ధమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విష్ణు పాత్రలో నాని నటించిన తీరుకు అందరు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సినిమాలో నాని పాత్ర మేజర్ హైలెట్ గా నిలిచింది. ఇక సుధీర్ బాబు కూడా నానికి పోటీగానే తన పర్ఫామెన్స్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరోయిన్ నివేద,హైదరీ  ఇద్దరు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. సాంకేతికంగా విజువల్ సౌండ్ డిజైనింగ్ సినిమాకు ఎంతో బాగా సెట్ అయింది

 

అయితే సినిమాలో కొత్తదనం ఏమాత్రం కనిపించలేదని కూడా చెప్పాలి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమిత్ త్రివేది అందించిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక ఫైట్స్ విషయంలో ప్రేక్షకులు నిరాశ చెందాల్సిందే. అన్నిటికంటే ముఖ్యమైన ఇంద్రగంటి డైరెక్షన్ గురించి చెప్పాలంటే 2006లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో పాటు  నాని సుధీర్ బాబు కాంబోలో సినిమా అవడంతో సినిమాపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను పూర్తిస్థాయిలో అందించలేకపోయారు అని చెప్పాలి. ఆడియన్స్ కు ఇవ్వాల్సిన ద్రిల్లింగ్ గాని ,ఎమోషనల్ గాని ఎక్కడా కనిపించలేదు. స్క్రీన్ ప్లే మరి స్లో గా ఉండటంతో ఆధ్యాంతం ఆకట్టుకునేలా కనిపించలేదు. లవ్ ట్రాక్స్ పాత సినిమాల సీన్స్ చాలావరకూ వాడేశారు మొత్తంగా  సినిమా గురించి చెప్పాలంటే పెద్దగా ప్రేక్షకులను అలరింప లేదని చెప్పాలి.

 

(+) పాయింట్స్

  • నని సహజనటన
  • సుధీర్ బాబు క్యారక్టరైజేషన్
  • యాక్షన్ సీన్స్
  • క్లైమ్యాక్స్

 

(-) పాయింట్స్

– ఆర్ ఆర్

– స్లో నేరేషన్

– డైరక్షన్

– ఎమోషన్స్

 

తెలుగు స్టార్ న్యూస్ రేటింగ్ : 2/5

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *