పవన్ అభిమానులకు గుడ్ న్యూస్…సిద్దంగా ఉండండి..!!!

పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత పూర్తిగా ప్రజా సేవకే అంకితమై పోతాడేమో అనుకున్న అభిమానులు వకీల్ సాబ్ సినిమా ప్రకటనతో ఎగిరి గంతేశారు. అయితే మధ్యలో దిక్కుమాలిన కరోన రావడంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే పవన్ అభిమానుల కోసం దసరా కానుకగా వకీల్ సాబ్ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి సిద్దమయ్యింది.

Chilling update: Vakeel Saab teaser on Pawan Kalyan birthday - tollywood

ఈ మేరకు వకీల్ సాబ్ సినిమా నిర్మాతలు ప్రకటించారు. అక్టోబర్ 25 అనగా సాయంత్రం 5 గంటలకు సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. రేపటి టీజర్ కోసం ఇప్పటి నుంచీ అభిమానులు వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *