చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్… సెన్స్ లేదా..రాధా

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన తీరు చాలా అభ్యంతర కరంగా ఉందని వంగవీటి రాధాకృష్ణ చాలా ఘాటుగా స్పందించారు. క్రమశిక్షణ మా పార్టీ లో కొరవడింది అని,వైసీపి నాయకులు వీధి రౌడీలుగా వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు లాంటి వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని,బాబు కొంచం హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి అని అన్నారు.   వైఎస్సార్ పార్టీలో ఎవరు తప్పు చేసినా వారి మీద వెంటనే చర్యలు ఉంటాయి అని మరి తెలుగుదేశం పార్టీలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రిని విమర్శించినా పట్టించుకోని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టే టీడీపి క్రమశిక్షణ ఏపాటిదో అర్ధం అవుతోందని అన్నారు వంగవీటి రాధా.

ఓ మాజీ శాసనసభ్యురాలిని రోడ్డుపై పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్తే అధికారుల తీరుపై చంద్రబాబు స్పందించక  పోవడం చద్రబాబు కి కనీస కామన్ సెన్స్ లేదనే విషయం మరోసారి స్పష్టం అవుతోంది అని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిపై విచారణ జరపాలని వంగవీటి రాధా డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేస్తానని,కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తా అని ప్రకటించారు. ఎక్కడ  రంగా అభిమానులు  సంయమనం కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టాను అని వివరించారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *