టాక్సీవాలా మూవీ..హిట్టా ఫట్టా..??? రివ్యూ..

సినిమా : టాక్సీవాలా

దర్శకత్వం : రాహుల్ సంక్రిత్యన్

నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంకా జావల్కర్, మాళవికా నాయర్ తదితరులు

సంగీతం : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్

నిర్మాత : బన్నీ వాస్, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి

బ్యానర్ :  GArts పిక్చర్స్ , యువి క్రియేషన్స్

Related image

విజయదేవర కొండ అలియాస్ అర్జున్ రెడ్డి నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా..ఈ సినిమా వరుస వాయిదాలు పడుతూ ఎట్టకేలకి ప్రజల ముందుకు వచ్చింది..గీత గోవిందం తరువాత అర్జున్ నటించిన నోటా దిక్కు లేకుండా పోవడంతో ఇప్పుడు అతడి ఆశలు అన్నీ టాక్సీవాలా పైనే పెట్టుకున్నాడు..అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడటంతో ఈ సినిమా విజయంపై పలు అనుమానాలు రేకెత్తాయి..మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కి బంగారు కొండ అవుతుందా లేక నోటా సరసన చేరుతుందా తెలుగు స్టార్ న్యూస్ రివ్యూ లో చూద్దాం..

 

కథ:
టాక్సీవాలా శివ(విజయ్ దేవరకొండ) డిగ్రీ ఉన్న ఒక నిరుద్యోగి, తనకు సరైన ఉద్యోగం రాకపోవడంతో ఏదైనా బిజినెస్ చేద్దామని సెకండ్ హ్యాండ్‌లో ఒక వింటేజ్ కారును తీసుకుంటాడు…అయితే తక్కువ ధరకు రావడంతో అతడు అత్యాశకు పోయి దాన్ని వెంటనే కొనేస్తాడు. అయితే ఈ కారులో ఏదో అతీత శక్తి ఉన్నట్లు అతడు గుర్తించిన శివ..అది దెయ్యం అని తెలుసుకుని ఆ కారు అమ్మిన ఓనర్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడ. కట్ చేస్తే.. ఆ కారులో దెయ్యం ఒక వ్యక్తిని చంపుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు కారులో దెయ్యం ఎలా వచ్చింది..మనుషలని ఎందుకు టార్గెట్ చేసింది అనేది కధ..

 

విశ్లేషణ :
విజయ్ కి వరుస విజయాలు వస్తున్న సమయంలోనే నోటా విజయ్ దూకుడికి బ్రేకులు వేసింది..అయితే తాజాగా విడుదలైన టాక్సీవాలా కూడా పెద్దగా ఆశించిన రీతిలో విజయాన్ని నమోదు చేసుకోలేదని చెప్పాలి. ఈ సినిమా ద్వారా అయినా సరే పడిపోతున్న గ్రాఫ్ నిలబెట్టుకుందామని అనుకున్న విజయ్ కి నిరాశే మిగిలింది. పూర్తిగా దెయ్యం కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా యూత్‌ను అలరించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పొచ్చు.

ఫస్టాఫ్ మొత్తం హీరో ఉద్యోగం లేక సతమతమవుతూ, ఏదైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూసి తక్కువ ధరకు వచ్చిందని ఒక వింటేజ్ కారును కొని ఎలా తిప్పలు పడతాడు అనేది చూపించారు. కారులో దెయ్యం ఉందని తెలుసుకున్న హీరో ఆ తరువాత దానితో స్నేహం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో హీరో మరియు అతడి స్నేహితులతో నడిచే కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద బూస్ట్ అని చెప్పాలి.

ఇదిలాఉంటే హీరోయిన్ ప్రియాంక జావల్కర్‌‌తో హీరో లవ్ ట్రాక్ అస్సలు బాగాలేదు. హీరోకు షాక్ ఇస్తూ ఒక కస్టమర్‌ను చంపుతుంది కారులోని దెయ్యిం. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ ట్విస్ట్ బాగుంది…అయితే  సెకండాఫ్‌లో అసలు కారులో ఉండే దెయ్యం గురించి తెలుసుకోవాలని హీరో అండ్ గ్యాంగ్ ప్రయత్నిస్తారు. వాళ్ళు చేసే ఒక ప్రయోగం వల్లే ఆమె కారులో దెయ్యంగా మారిందని తెలుసుకుంటాడు శివ. అసలు ఈ ప్రయోగం చేయడానికి ఎందుకు ఒప్పుకుంది అనే అంశం బాగా చూపించాడు దర్శకుడు.

ఇక కారుతో సిసిరకు ఉన్న సంబంధం ఏమిటో తేల్చే పద్ధతిలో శివ ఊహించని నిజాలు బయటపడతాయి. ఓవరాల్‌గా చూస్తే ఇదొక సూపర్‌ నేచురల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను భయపెడుతూ నవ్విస్తుంది…కానే హిట్స్ లేని సమయంలో విజయ్ ప్రయోగాల జజోలికి వెళ్ళకుండా ఉండటం మంచిదని అనిపించింది.

Image result for taxiwala

నటీనటులు పర్ఫార్మెన్స్:
శివగా విజయ్ దేవరకొండ యాక్టింగ్ సూపర్. ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కాడు విజయ్. నేచురల్ యాక్టింగ్‌తో కామెడీని పండించడమే కాకుండా భయపడుతూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక క్లైమాక్స్ సీన్స్‌లో అతడు చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్‌ ప్రియాంకా జావల్కర్ ఈ సినిమాలో ఉందా అంటే ఉంది అనే టైపులో ఆమె పాత్ర ఉంటుంది. నటనకు ఏమాత్రం స్కోప్‌లేని పాత్రలో ఆమె నటించింది. మరో హీరోయిన్ మాళవికా నాయర్‌కు మాత్రం సినిమాలో మంచి పాత్ర దొరికింది. ఇక కామెడీ పండించడంలో హీరో ఫ్రెండ్స్ మధుసూదన్, మరియు చమ్మక్ చంద్ర అదరగొట్టారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేర బాగా మెప్పించారు.

 

చివరగా..చెప్పాలంటే..
క్లిష్టమైన సమయంలో ప్రయోగాలు చేయకూడదు ఇదే ఈ సినిమాకి నీతి

 

రేటింగ్:
2.5/5

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *