రివ్యూ : వారసుడు ఆకట్టుకోలేదు….ఇన్ని మైనస్ లా….!!

సంక్రాంతి కానుకగా వచ్చిన విజయ్ వారసుడు తమిళ వెర్షన్ లో వరిసుగా వచ్చిన ఈ సినిమాను మన తెలుగు దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్ రాజు దాదాపు రూ. 200 కోట్ల తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది అనేది పరిశీలిద్దాం. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై దిల్ రాజు భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Vijay And Vamshi Paidipally Varasudu Movie Story Goes Viral On Social Media  - Sakshi

కధ విషయానికి వస్తే

సంపన్న కుటుంబానికి చెందిన విజయ్ తన తండ్రి శరత్ కుమార్ పేరు చెప్పుకుని బ్రతకడానికి ఇష్టపడదు, అలాగే కొడుకు పేరు పలకడానికి తండ్రి శరత్ కుమార్ కి ఇష్టం ఉండదు. ఈ నేపధ్యంలో విజయ్ ఇంటి నుంచీ వెళ్ళిపోవడం, తన అన్న దమ్ములు తమదే ఈ వ్యాపారం అంటూ విర్ర వీగడం జరుగుతుంది. ఊహించని విధంగా మళ్ళి హీరో విజయ్ ఇంటికి తిరిగి రావడంతో ఇంట్లో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు  చూసి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే తండ్రికి దగ్గరవుతాడు. ఈ క్రమంలో విజయ్ ఈ సమస్యలను ఎలా అధిగమిస్తాడు అనేదే కధ.

varasudu: విజయ్‌ 'వారసుడు' మూవీ స్టిల్స్‌

సినిమాకు మైనస్

ఎప్పుడు ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పడమేనా ముందుగా మైనస్ పాయింట్స్ చెప్పుకుందాం.

సెకండ్ హాఫ్ చాలా స్లో. సినిమాలో లెక్కకు మించిన పాత్రలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి ఇవే సినిమాకు అతి పెద్ద మైనస్.  అంతేకాదు సినిమాలో ఏం జరగబోతోందో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఇట్టే చెప్పేయచ్చు. అలాంటప్పుడు సినిమాపై ఆశక్తి, కుర్చీలో కుదురుగా కూర్చోవాలనే ఆలోచన ఎలా వస్తాయి. ఇక మరొక అతిపెద్ద మైనస్ ఏంటంటే. ప్రకాష్ రాజ్ విలనిజం వర్క్ అవుట్ అవ్వకపోవడం, గ్రాఫిక్స్ పేలవంగా ఉండటం, హిట్ పాట అయిన రంజితమే పాటను సినిమాలో కావాలని ఇరికించినట్టుగా ఉండటం.

Varasudu Movie HD Stills | Vijay | Rashmika

ఇక సినిమా కు ప్లస్

ఫస్ట్ హాఫ్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు చేయడంలో విజయ్ కు పెట్టింది పేరు సో ఎప్పటిలానే సినిమాలో విజయ్ తనదైన నటనతో అదరగొట్టాడు. ఎక్కడా ఇగో పెర్ఫార్మెన్స్ కనపడలేదు. సంక్రాంతి కావడం ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా కావడంతో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. మరీ తీసిపడేయాలెం కానీ సినిమాను మైనస్ పాయింట్స్ దృష్టిలో పెట్టుకోకుండా ఫ్యామిలీ సరదాగా వెళ్లి ఓ సారి చూసి వచ్చేయచ్చు.  ఇంతకీ ధమన్ సంగీతం అద్భుతంగా ఏమి లేదుగానీ పర్లేదు. హీరోయిన్ రష్మిక పరిమితి కేవలం పాట్ల వరకే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *