అయ్యో…అయ్యో…అయ్యయ్యో…..!!!

దురదృష్టం వెంటాడుతుంటే గడ్డి పోచ కూడా గునపంలా మారిపోతుందంటారు. అలాగే జేబూలో దరిద్రం ఉంటే చంద్రమండలంలోకి వెళ్లి దాక్కున్నా వెంటాడి వెంటాడి తరుముతుందని కూడా అంటారు పెద్దలు. సరిగ్గా ఇలాంటి సూక్తులు, హెచ్చరికలు, వగైరా వగైరా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి అచ్చు గుద్దినట్టుగా సరిపోతాయి. గత కొంతకాలంగా ట్రంప్ కి దరిద్రం అదృష్టం పట్టినట్టుగా పట్టిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Trump visits site of California's most deadly fire, pledges federal help

కేవలం నెల వ్యవధిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అమెరికాలో సంభవిస్తున్న పరిణామాలు అన్నీ ట్రంప్ చుట్టూ తిరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది…నల్లజాతీయులను పోలీసులు హత్య చేయడంతో మొదలు జాత్యహంకారిగా ముద్ర పడిన ట్రంప్ కి కరోనా ఎఫెక్ట్ తో అసమర్ధ అధ్యక్షుడు అనే అపకీర్తి అంటుకుంది. ఇక అమెరికాలో కారు చిచ్చు ఇప్పటికే లక్షల హెక్టార్ల అడవిని దహించి వేస్తుంటే అవి చూస్తూ కూర్చోవడం తప్ప ట్రంప్ కి ఏమి తెలియదంటూ ప్రతిపక్ష పార్టీలో ప్రచారం చేస్తున్నాయి.

President Trump threatens to pull federal funding for California | KMPH

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని భావిస్తున్న డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ ఓ అసమర్ధుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలని అంటాడు కానీ లక్షల హెక్టార్ల అడవి కాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడు అంటూ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రతిపక్ష పార్టీల నోరు మూయించడానికి ఘటన స్థలానికి చేరుకోగా భాదితులు ట్రంప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దాంతో ట్రంప్ ఒకింత నిరాశగా వెనుతిరిగినట్టుగా తెలుస్తోంది.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *