word record Belgian pigeon

ఆ పావురం విలువ అక్షరాలా రూ.11 కోట్లు..ఎందుకంటే..!!

జంతువులలో జాతులను బట్టి వాటికి డిమాండ్ బాగా ఉంటుంది. ఇంట్లో పెంచుకునే కుక్కలు మహా అయితే లక్ష మరీ అనుకుంటే 2 లక్షలు..కొన్ని కొన్ని 50 లక్షల వరకూ డిమాండ్ ఉంటాయి. ఇక ఆవుల విషయానికి వస్తే వాటి విలువ కూడా లక్షల్లో ఉంటుంది. ఇలా ఏ జంతువును తీసుకున్నా వాటి విలువ కేవలం లక్షల్లో ఉంటుంది. కానీ ఒక పావురం విలువ ఎంత ఉంటుంది మహా అయితే 5వేలు..అదీ కాదనుకుంటే 20 వేలు కూడా పలికేవి ఉంటాయి. కానీ ఓ పావురం విలువ రూ.11 కోట్లు ఖరీదు ఉంటడం ఎక్కడైనా చూశారా..??? అసలు విన్నారా..??

 

బెల్జియంలో ఇలాంటి పావురమే ఉంది. దాని విలువ అక్షరాలా రూ. 11 కోట్ల పైమాటే. అంతేకాదు మరో రెండు రోజులు అయితే దానివిలువ అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉందట. ఇంతకీ ఆ పావురం ఎందుకు అంత ఖరీదు ఉన్నట్టు, దాని స్పెషాలిటీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Champion Pigeon Sold for $1.4 Million - YouTube

కోళ్ళకు, పొట్టేళ్లకు, గుర్రాలకు పందాలు నిర్వహించినట్టుగానే పావురాల పందాలు కూడా బెల్జియంలో నిర్వహిస్తారు. అక్కడ పావురాల పందాలంటే ఎంతో ఫేమస్. దాంతో బెల్జియం కి చెందిన హక్ వాన్ డే అనే వ్యక్తి పలు రకాల పావురాల జాతులు సేకరించి వాటితో కొత్త జాతులు సృష్టిస్తూఉంటాడు. వాటిని అత్యధిక ధరలకు అమ్ముతూ ఉంటాడు. అందుకోసం ఏకంగా ఓ పెద్ద వెబ్ సైట్ కూడా నడుస్తోంది. దాని పేరు పిపా (pipa) అతడు ఈ వెబ్ సైట్ ద్వారా ఈ పావురాలు అమ్ముతూ ఉంటాడు. ఇలా అతడు వేలంలో పెట్టిన పావురాలలో న్యూకిమ్ అనే పావురం ఎంతో స్పెషల్.

Postagalambok panosundaki Pin

దాని వయసు కేవలం రెండేళ్ళు మాత్రమే. ఇప్పుడు దానిని వేలంలో దక్కించుకోవాలని ఎంతో మంది పోటీ పడుతున్నారు. మొదట్లో వేలం పెట్టినప్పుడు దానివిలువ 17 వేలు ఉండేదట. కానీ పస్తుతం దాని విలువ అక్షరాలా రూ. 11 కోట్ల. మరో నాలుగు రోజుల పాటు ఈ వేలం పాట కొనసాగనుందని, వేలం ముగిసేలోగా దాని ఖరీదు ఏ స్థాయికి వెళ్తుందోనని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *