టీడీపీ కంచుకోటపై జగన్ మార్క్ రాజకీయం…యువ నేతకు కీలక బాధ్యతలు..!!

రాజకీయాల్లో నెగ్గుకు రావడం, నిలదోక్కుకోవడం  అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో సవాళ్లు, వెన్నుపోట్లు , మరెన్నో విపత్కర పరిస్థితుల ఎదుర్కోవాలి. అలా ఆరితేరిన వాళ్ళే రాజకీయ రంగంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించగలరు. ఎలాంటి రాజకీయ కుటుంభ నేపధ్యం లేకపోయినా తమకు ఉన్న చర్ష్మాతో, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, అనతికాలంలోనే ప్రజాదరణ నేతగా, పార్టీకి వీర విధేయులుగా  ఎదిగిన వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే అలాంటి సామాన్యులకు  కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తూ , వారిని కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టగలిగే పార్టీ అధినేతలు కూడా అరుదుగానే కనిపిస్తూ ఉంటారు. ఈ విషయంలో

May be an image of 3 people and people standing

వైసీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందువరుసలో ఉంటారనే చెప్పాలి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పార్టీ కోసం కష్టపడి, పార్టీ అధిష్టానం ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఎక్కడా అసంతృప్తికి గురవ్వకుండా మెలిగిన నేతలు చాలా కొద్దిమంది మాత్రమే. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత  వీరి విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ద పెట్టారనే చెప్పాలి. అలా జగన్ దృష్టిలో పడిన వారిలో ఒకరు ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్ కవురు  శ్రీనివాస్. వైద్యుడిగా ప్రజలకు సేవ చేస్తూ మొదలైన ఆయన రాజకీయ జీవితం ఎంపీపీ స్థాయి నుంచి మొదలయ్యింది.  అంచలంచెలుగా ఎదుగుతూ డీసీసీబి ఛైర్మెన్ గా  నేడు జిల్లా జెడ్పీ చైర్మన్ గా, పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గా విజయవంతంగా ఉందంటే అందుకు ప్రధాన కారణం ప్రజలలో ఆయనకు ఉన్న ఆదరణ,  జగన్ ప్రోత్సాహమే.

May be an image of one or more people, people standing, rose and indoor

పశ్చిమలో పాలకొల్లు నియోజకవర్గంకు టీడీపీ కి కంచుకోట అనే ముద్ర ఉంది.  వరుసగా రెండు సార్లు అక్కడ టీడీపీ గెలుపొందటంతో జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టీడీపీ కంచుకోటను ఢీ కొట్టాలంటే  ఓ బలమైన, ప్రజాదరణ కలిగిన, అక్కడి సామాజిక వర్గాలకు చెందిన నేతను రంగంలోకి దించాలని జగన్ భావించారు. దాంతో జగన్ జిల్లాలో తనకు నమ్మకస్తుడిగా పేరున్న బీసీ సామాజికవర్గానికి చెందిన జిల్లా  జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ కు వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు టిక్కెట్టు ఖరారు చేస్తూ, 2024 ఎన్నికల్లో పాలకొల్లులో గెలిచి చూపించాలని కవురు ను  ఆదేశించినట్టుగా తెలుస్తోంది…ఇదిలాఉంటే

May be an image of 7 people, people standing and outdoors

పాలకొల్లు నియోజకవర్గంలో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాల ఓట్లు అత్యంత కీలకంగా ఉంటాయి. కవురు శ్రీనివాస్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిననేత కావడంతో పాటు, ఆయనకు తన  సామాజిక వర్గంలో విశేషమైన ఆదరణ కూడా ఉంది.  ఈ క్రమంలోనే కవురు కు జిల్లా జెడ్పీ చైర్మన్ ఇవ్వడంతో  శెట్టిబలిజలు  మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సామాజిక వర్గాలకు అతీతంగా ప్రజలలో ఆదరణ ఉండటం కవురు శ్రీనివాస్ కు అతిపెద్ద అసెట్ అనే చెప్పాలి. అలాగే యువ నాయకుడు కావడంతో  యూత్ లో మంచి క్రేజ్ కూడా సంపాదించారు.

May be an image of one or more people, people sitting and people standing

ఇక కాపు సామాజిక వర్గం కూడా కవురు కు సైలెంట్ గా మద్దతు తెలుపుతోందట. గత ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి న్యాయం జరగలేదని కరువు శ్రీనివాస్ ఇంచార్జ్ గా వచ్చిన తరువాత తమను గుర్తించారని కాపు వర్గం నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలని సైతం చాకచక్యంగా చేదిస్తూ పార్టీకి ఎక్కడా డ్యామేజ్ అవకుండా మ్యానేజ్ చేయడంలో కవురు సక్సస్ అయ్యారనే చెప్పాలి. అన్నిటికంటే మించి ఎంతో సౌమ్యుడిగా పేరున్న కవురు పాలకొల్లు నియోజకవర్గంలో  ప్రజలకు సేవలు అందించే విషయంలో కానీ, ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరువ చేసే విషయంలో కానీ ఎక్కడా రాజీపడటంలేదని, చాపకింద నీరులా ఎలాంటి హడావిడి లేకుండా  తనపని తాను చేసుకోపోతారనే పాజిటివ్ టాక్ కూడా ప్రజలలో కవురుకు క్రేజ్ పెంచాయి.

May be an image of one or more people, people standing and outdoors

ఇటీవల జరిగిన జెడ్పీ టిసి ఎన్నికల్లో యలమంచిలి నుంచీ పోటీ చేసి విజయం సాధించారు కవురు శ్రీనివాస్. యలమంచిలి మండలంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది, అలాగే పోటా పోటీగా శెట్టిబలిజ, కమ్మ వర్గం  కూడా ఎక్కువే. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ, టీడీపీ పన్నిన కుట్రలను చేదించుకుంటూ దాదాపు 13  వేల ఓట్ల పై చీలుకు  మెజారిటీతో గెలుపొందటం సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుత ఈ  పరిణామాలే భవిష్యత్తులో పాలకొల్లులో మారబోతున్న సమీకరణాలకు నిదర్సనమని, 2024 ఎన్నికల్లో పాలకొల్లు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడం కవురుకు మాత్రమే సాధ్యమవుతుందనే చర్చ జోరుగా జరుగుతోంది.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *