“కేంద్ర దర్యాప్తు సంస్థ” కి జగన్ కేసు…శివాజీ బెండు తీస్తారా..??

జగన్ పై దాడి జరిగిన సంఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించింది.. ఈ కేసు విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పై నమ్మకం లేదని జగన్ తేల్చి చెప్పడంతో వైసీపీ నేతలు సైతం హైకోర్ట్ లో కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థలకి అప్పగించాలని పిటిషన్ వేశారు..అదేసమయంలో మరి కొందరు వైసీపీ నేతలు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాద్ సింగ్ తో భేటీ అయ్యి. జగన్ పైదాడి జరిగిన విధానం, ఆతరువాత చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు, ప్రభుత్వం , పోలీసు అధికారులు అనుసరించిన తీరు తెన్నులు సవివరంగా తెలిపారు.

Image result for hero sivaji

చంద్రబాబు చేయిస్తున్న దర్యాప్తుపై తమకి నమ్మకం లేదని జగన్‌పై జరిగిన దాడి ఘటనను కేంద్ర దర్యాప్తు సంస్థలో విచారణ చేయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.సమావేశ అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరిగిన పరిస్థితులన్నిటినీ రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించామన్నారు..దీనిపై ఆయనకూడా సానుకూలంగా స్పందించారని. ఈ ఘటనపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.

Image result for jagan attack

ఇదిలాఉంటే విజయవాడలో వైసీపీ నేతలు అక్కడి కమిషనర్ ద్వారకాతిరుమల రావుకి హీరో శివాజీపై లిఖిత పూర్వక ఫిర్యాదు అందించారు..శివాజీ చెప్పిన దాని ప్రకారం జగన్ పై దాడులు జరిగాయని. మక్కికికి మక్కి శివాజీ చెప్పినట్టే జరుగుతున్నాయని అందుకే అతడిని అదుపులోకి తీసుకుని విచారించాలని, జగన్ దాలో శివాజీ ప్రమేయం ఉందని మాకు అనుమానాలు ఉన్నాయని వైసీపీనేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు..అయితే త్వరలోనే కేంద్రం బృందం విచారణ చేపడుతుంది త్వరలో శివాజీ బెండు కూడా తీస్తారని వైసీపీ నేతలు అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *