బ్రేకింగ్ – జగన్ పై దాడి కేసు “సీబీఐ” కి అప్పగించండి..!!!

జగన్ పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ కేసుని నీరు గారుస్తుందని మాకు నమ్మకం లేదని ముందు నుంచీ వాదిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు  హైకోర్ట్ లో తాజాగా ఒక పిటిషన్ వేసింది. జగన్ పై హత్యా యత్నం కుట్ర పూరితంగా జరిగిందని పిటిషన్ దాఖలు చేసింది. ఈ కుట్ర కోణాన్ని వెలికి తీయాలని హైకోర్ట్ కి ఎక్కింది..
Image result for ysrcp petition high court jagan attack

ఈ విషయంలో కేంద్రంలోని సీబీఐ చేత విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపైనే అనుమానాలున్న నేపథ్యంలో థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించాలని కోరారు…మా కోరికని మన్నించి సీఐఎస్ఎఫ్ అధికారుల నుంచి రిపోర్ట్ తీసుకోవడంతోపాటు సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరారు.

Image result for ysrcp petition high court jagan attack
వైసీపీ మాజీ ఎంపీ వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా ఇలానే వైసీపీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్ – అమర్ నాథ్ రెడ్డిలు కూడా పిటీషన్ జగన్ పై హత్యాయత్నంపై  సీబీఐ విచారణ జరపించాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ ముగ్గురి పిటీషన్లను కలిపి కోర్టు విచారించనుంది.ఒక వేళ ఇదే గనుకా జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ఇది మాయని మచ్చలా ఉండిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే పిటిషనర్ల కోరిక మేరకు కోర్టు ఈ కేసు విచారణ సీబీఐ కి అప్పగించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *