వైసీపీలో రోజాకు హేమ‌తో చెక్‌..

వైసీపీ ఫైర్‌బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజాకు వైసీపీలో చెక్ పెట్ట‌డం ఖాయ‌మైనట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో టీడీపీలో రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన రోజా ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత వైసీపీలో చేరిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడిని ఓడించి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆమెను దూకుడు త‌గ్గించుకోవాల‌ని జ‌గ‌న్ ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాత్రం మార‌లేదు. దీంతో జ‌గ‌న్ రోజాను క్ర‌మ‌క్ర‌మంగా ప‌క్క‌కు తప్పిస్తూ, ఆమెకు మ‌రో సినీ లేడీతోనే చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ డెసిష‌న్ తీసుకున్నట్టు వైసీపీలోనే టాక్ న‌డుస్తోంది. పార్టీలో కూడా వైసీపీలో ఎంతోమంది సీనియ‌ర్లు ఉన్నా రోజా మాట్లాడితేనే ఎక్కువ క‌వరేజ్ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలోను ఆమెకే ప్ర‌యారిటీ ఇస్తున్నారు.
రోజా తీరుతో జ‌గ‌న్ అసెంబ్లీలో కూడా చాలా ఇబ్బండి ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే రోజాను ప‌క్క‌కు త‌ప్పించి ఆ ప్లేస్‌లో  ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ‌ను రంగంలోకి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. హేమ ముద్రగడ పద్మనాభంతో కలిసి కాపు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారు.
ఆమె గ‌త ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట నుంచి జైస‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. మ‌రి వైసీపీలో జ‌గ‌న్ ఆమెకు మండ‌పేట అసెంబ్లీ సీటు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *