బ్రేకింగ్ :1,11,093 ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!!

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఎన్నో నెలలుగా సంసిద్దంగా ఉన్న నిరుద్యోగులు ఒక్క సారి ఎగిరి గంతేసేలా సుమారు 1,11,093  ఖాళీలు భర్తీ చేయనున్నట్టుగా ప్రకటించింది. ముఖ్యంగా సిఆర్పీఎఫ్ , సిఐఎస్ఎఫ్ , ఐటీబీపీ వంటి శాఖలలో సుమారు లక్షకు పైగా ఉద్యోగాలు ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు తెలిపారు.

News18 Telugu - Total 111093 vacancies in Central Armed Police Forces says  Central Government | Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 1,11,093 ఖాళీలు...  ప్రకటించిన ప్రభుత్వం- Telugu News, Today's Latest News in Telugu

రిటైర్మెంట్ కారణంగా అలాగే ఉద్యోగుల మరణాలతో భారీ స్థాయిలో కాళీలు ఏర్పడ్డాయని అన్నారు. వీటన్నిటిని భర్తీ చేసేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయని, నియామకాలు ఎప్పటిలానే కొనసాగుతాయని తెలుస్తోంది.

News18 Telugu - Total 111093 vacancies in Central Armed Police Forces says  Central Government | Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 1,11,093 ఖాళీలు...  ప్రకటించిన ప్రభుత్వం- Telugu News, Today's Latest News in Telugu

బీఎస్ఎఫ్ లలో మొత్తం 28,926 అత్యధికంగా ఖాళీలు ఉండగా సిఆర్పీఎఫ్ లో 26,506 ఖాళీలు , సిఐఎస్ఎఫ్ 23,906 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఎస్ ఎస్ బీ లో 18, 643  ఖాళీలు ఉండగా ఐటీబీపీ లో 5,784, అస్సాం రైఫిల్స్ లో 7,328 ఖాళీలు ఉన్నాయి.ఈ మొత్తం పోస్టులలో కానిస్టేబుల్ పోస్టులు అత్యధికంగా ఉన్నాయని . UPSC ద్వారా కొన్ని పోస్టులు భర్తీ అవుతాయని తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *