క్రికెట్ లో బౌలింగ్ ఎలా చేస్తారో అందరికి తెలిసిందే..వాటిలో కూడా కొన్ని కొన్ని రకాలు ఉంటాయి కానీ టీమిండియా బౌలర్ మాత్రం సరికొత్త బౌలింగ్ కనుగొన్నాడు అంతేకాదు అది అమలు చేశాడు కూడా..దాంతో ఒక్క సారిగా క్రికెట్ ప్రపంచం అవ్వాక్కయింది. ఇదెక్కడి బౌలింగ్ అంటూ తలలు పట్టుకుంది.అంతేనా ఈ బౌలింగ్ పై సుదీర్ఘ చర్చలు కూడా జరిపింది. మరి అదేంటో తెలుసుకోవాలని ఉందా సరే మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/yMI6Y1vN0_E
సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా కల్యాణిలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో శివసింగ్ గుండ్రంగా తిరిగి బౌలింగ్ వేశాడు. రన్‌ప్ ప్రారంభించిన శివసింగ్ క్రీజు దగ్గరికి వచ్చేసరికి 360 డిగ్రీల్లో చుట్టూ తిరిగి బౌలింగ్ వేశాడు. అవాక్కైన అంపైర్ దానిని ‘డెడ్‌బాల్’గా ప్రకటించాడు. దీంతో షాకవడంతో యూపీ ఆటగాళ్ల వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడి బౌలింగ్ యాక్షన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దాంతో శివసింగ్ బౌలింగ్ యాక్షన్‌పై లండన్‌లోని అతి పురాతన క్రికెట్ క్లబ్.. మ్యారిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కూడా స్పందించింది. బౌలర్ రనప్ ఎలా ఉండాలనేది ‘క్రికెట్‌లా’లో లేదని పేర్కొంటూ కొన్ని నిబంధనల గురించి వివరించింది. 360 డిగ్రీల బౌలింగ్ బౌలర్ సహజ శైలి అయితే అంపైర్ పట్టించుకోవాల్సిన పనిలేదని, ఒకవేళ బ్యాట్స్‌మన్‌ను భయపట్టేందుకే అలా చేసి ఉంటే మాత్రం తప్పేనని తేల్చి చెప్పింది. సో.. మొత్తంగా శివసింగ్‌కే మద్దతు ఎక్కువగా లభిస్తోంది..మరి ఇక ఇలాంటి బౌలింగ్ స్టైల్స్ ఇంకెన్ని భవిష్యత్తులో చూడబోతామో వేచి చూడాలి.