పశ్చిమ విద్యార్ధినికి ప్రకాష్ రాజ్ సాయం..!!

పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన సిరి చందన అనే విద్యార్ధిని బీఏస్సీ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం లండన్ యూనివర్సిటీ లో చదువుకోవాలనే కోరికతో ఆన్లైన్ పరీక్ష రాసి ఎమ్మెస్ కి సెలక్ట్ అయ్యింది. లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ ఫోర్డ్ లో సీటు సంపాదించింది. అయితే ఒకవైపు పేదరికం లండన్ వెళ్ళడానికి అడ్డుపడటంతో తన కలను మధ్యలోనే ఆపేయాలని భావించింది. అయితే

Prakash Raj Helping Hand to Poor Student Education - Sakshi

కొందరు మిత్రులు, సన్నిహితులు సోషల్ మీడియా లో ఆమె పరిస్థితిని తెలియజేయగా ఈ విషయం కాస్తా నటుడు ప్రకాష్ రాజ్ దృష్టికి వెళ్ళింది. సదరు విద్యార్ధిని చడువుకోసం నేను సాయం చేస్తానని తెలుపడంతో సిరి చందన ఆనందానికి అవధులు లేవు. వెంటనే తన తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లి ప్రకాష్ రాజ్ ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపింది. తమ జిల్లా వాసికి ప్రకాష్ రాజ్ సాయం చేయడంతో పశ్చిమ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *