నంద్యాల‌లో టీడీపీ – వైసీపీ ఎవ‌రికి ప్ల‌స్‌లు ఎక్కువ‌.

నంద్యాల ఉప‌పోరు రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇక ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య పోటీ చాలా ట‌ఫ్‌గా ఉంది. ఇక ఇక్క‌డ ఈ రెండు పార్టీల ప్ల‌స్‌లు, మైన‌స్‌ల‌పై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా లెక్క‌లు వేసుకుంటున్నారు. ఓవ‌రాల్‌గా టీడీపీకే ఎక్కువుగా ప్ల‌స్‌లు క‌నిపిస్తున్నాయి.
నియోజ‌క‌వర్గంలో 46 వేల ఓట్లు ఉన్న మైనార్టీలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇప్పుడు వారిలో ఎంతైనా ఎడ్జ్ టీడీపీ వైపు ఉంది. జ‌గ‌న్ మోడీని క‌ల‌వ‌డం, భూమా ఫ్యామిలీ సానుభూతి, బాబు ఇక్క‌డ మైనార్టీల నాయ‌కుల‌కు కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌డంతో ఇప్పుడు వారిలో టీడీపీ వైపు మొగ్గు క‌న‌ప‌డుతోంది.
ఇక ఇక్క‌డ కోట్లాది రూపాయ‌తో టీడీపీ అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం, బ‌లిజ వ‌ర్గం ఓట‌ర్లు సైతం టీడీపీకే అనుకూలంగా ఉండ‌డం, టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులు ఇద్ద‌రూ రెడ్డి వ‌ర్గం అభ్య‌ర్థులే అయినా వారు కూడా టీడీపీ వైపే మొగ్గు చూప‌డం ఆ పార్టీకి ప్ల‌స్ కానుంది. ఇక గ‌తంలో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గోస‌పాడు మండ‌లం ఇప్పుడు నంద్యాల‌లో క‌లిసింది. ఇక్క‌డ కూడా టీడీపీకి ఎడ్జ్ క‌న‌ప‌డుతోంది.
ఇక భూమా ఫ్యామిలీపై ఉన్న సానుభూతి ఎలాగూ క‌లిసి రానుంది. ఇక వైసీపీకి ఉన్న ప్ల‌స్ పాయింట్స్‌లో శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేయ‌డం, ఆయ‌న సోద‌రుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సైతం వైసీపీలోకి వెళ‌తార‌న్న ఊహాగానాలు, నంద్యాల టౌన్ ఓటింగ్ ఉన్నాయి. ఏదెలా ఉన్నా ఓవ‌రాల్‌గా ప్ల‌స్ పాయింట్స్ టీడీపీకే ఎక్కువుగా ఉన్నాయి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *