“యూట్యూబ్” లో పవర్ స్టార్ సరికొత్త.. “రికార్డ్”

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోరాతయత్రలో ఒక వైపు బిజీ బిజీ గా ఉంటుంటే మరో పక్క ఆయన నటించిన సినిమా అజ్నాతవాసి యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది..అదేంటి అది రిలీజ్ అయ్యి ఎప్పుడో అయ్యింది ఇప్పుడు రికార్డ్స్ ఏమిటి అనుకుంటున్నారా..అవునండి నిజమే అజ్ఞాతవాసి’ సినిమా ఇప్పుడు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.ఇంకా అర్థం కావడం లేదుకదా సరే అసలు వివరాలలోకి వెళ్తే..

Image result for ajnatavasi

పవర్ స్టార్ , త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. బయ్యర్ లు సైతం ఎంతో నష్టపోయారు. మరి అలాంటి సినిమా యూట్యూబ్ లో రికార్డులు ఎలా సృష్టించింది అంటే..ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను హిందీలో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాను కూడా హిందీలో ‘ఎవడు 3’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు.

Image result for agnyaathavaasi hindi dubbed

అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షెన్‌ను అక్టోబరు 20న యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. హిందీలో డబ్‌ చేసి.. యూట్యూబ్‌లో విడుదల చేసిన దక్షిణాది సినిమాల్లో అత్యధిక వ్యూస్ అతి తక్కువ కాలంలో సాధించిన చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ నిలిచింది.కేవలం మొదటి రోజునే అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన దక్షిణ భారతదేశ చిత్రంగా మరో రికార్డును నమోదు చేసుకుంది.కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డు సాధించి చరిత్ర తిరగరాసింది

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *