అల్లూ అర్జున్ న్యూ లుక్..రెండు కళ్ళూ చాలవుగా..!!!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మెగా స్టార్ మేనల్లుడు అల్లూ అర్జున్ ఎప్పటికప్పుడు అభిమానులను అలరించడానికి నయా ట్రేడ్ సెట్ చేయడానికి స్టైల్ స్టైల్ గా కన్పిస్తూ ఉంటాడు. తన బాడీ లాంగ్వేజ్ మొదలు వాడే కాస్ట్యూమ్స్ వరకూ అన్నిటిలో కొత్తదనం కనిపిస్తుంది. అందుకే అల్లూ అర్జున్ ని స్టైల్ స్టార్ అంటారు. అయితే ప్రస్తుతం సుకుమార్ దర్సకత్వంలో చేస్తున్న పుష్ప సినిమాలో ఫుల్ మాస్ లుక్ లో కనిపించే ఈ స్టైల్ స్టార్ షూటింగ్ కాస్తా పోస్ట్ పోన్ అవ్వడంతో తన లుక్ ని మరింత స్టైల్ స్టైల్ గా మార్చేశాడు..

I miss the hustle: Allu Arjun

తాజాగా తన నిర్మాణ  సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోకి వచ్చిన బన్నీ చూడటానికి స్టైల్ కే కేక పుట్టించేలా, హోరోలందరికి ఈర్ష్య కలిగించేలా కళ్ళు చెదిరిపోయే లుక్స్ తో కనిపించాడు. కరోనా కారణంగా గీతా ఆర్ట్స్ కార్యలయం మూగబోవడం చూసి ఎంతో బాధపడ్డాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అల్లూ అర్జున్ పనిలో పనిగా తన న్యూ లుక్ కూడా పోస్ట్ చేశాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ లుక్ ఇప్పుడు అభిమానులని ఉర్రూతలూగించడమే కాదు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *