వీటిని తింటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది….

బాదం పప్పుఅంటే చాలా మందికి అనిపించేది అది శరీరానికి బలాన్ని ఇస్తుంది అని,అవును నిజమే అంతేకాదు ఎన్నో రకాల రోగాలకి ఒక మెడిసిన్ లా కూడా పనిచేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నరాలను బలపరిచే నియాసిన్ ఉప్పు ఇందులో ఎక్కువగా ఉంది. పీచు పుష్కలంగా ఉంది. తద్వారా హృద్రోగ వ్యాధులు దూరమవుతాయి. ఆకలి అధికంగా వుంటేవారు రోజు పది బాదం పప్పులను తినడం చేస్తే ఫలితం ఉంటుంది. బాదంను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా లిబేస్ అనే పోషకాలు విడుదలవుతాయి .బాదం తినడం వలన తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా వుంటుంది.

 

ప్రతిరోజూ రాత్రి పూట 10 నుంచి 12 బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం పూట తింటే వీర్యం పెరుగుతుంది బాదం లో ఉన్న మరొక ప్రత్యెక గుణం ఏమిటంటే బాదం తో  గుడ్ కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటుంది కావున బాదం పప్పుల్ని తినడంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.

 

అంతేకాక  మెదడును, కిడ్నీలను రక్షించే ఫాస్పరస్, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో క్యాల్షియం 30 ఏళ్లు దాటిన మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. బాదం పప్పుల్లోని ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు     శరీరంలో ఉన్న కొలిస్త్రాల్ స్థాయిని తగ్గించే గుణం దీనిలో ఉంది అని వైద్యులు చెప్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *