“ఆనపకాయ”  చూపించి కోట్లు కాజేశారు

మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసాలు చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. నిత్యం ఎదో ఒక చోట కేటుగాళ్ళ వలలో ఎంతో మంది అమాయకపు ప్రజలు పడుతూనే ఉంటారు. సెంటిమెంట్, దేవుడు ,దెయ్యం పేర్లు చెప్పి లక్షలు కాజేస్తున్న వారు లేకపోలేదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఏపీలో తాజాగా బయటపడింది. క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టుగా డబ్బులు పోగొట్టుకుంటేనే కానీ అసలు మర్మం విషయం తెలిసిరాలేదు.

File:Calabash (Lagenaria siceraria) in Seoul.jpg - Wikimedia Commons

సహజంగా మనకి దొరికే ఆనపకాయలు కూర వండుకుని తింటాం. కానీ బయట పొదల్లో కాసే కొన్ని సొరకాయలు అచ్చం పాములు ఊదే బూరల్లా ఉంటాయి. ఇవి కొన్నేళ్ళ క్రితం ఎక్కడ బడితే అక్కడ కన్పించేవి. కానీ ప్రస్తుతం శ్రీశైలం అడవుల్లో విరివిగా కనపడటంతో కేటుగాళ్ళు వాటిని మహిమగల ఆనపకాయలు అంటూ శ్రీశైలంలో మాత్రమే అది కూడా మహా శివుడి చే సృష్టించబడ్డాయంటూ ఎంతో మందిని నమ్మించి మోసం చేశారు. ఇలా ఒక్కొక్కరి వద్దా ఒక్కో అనపకాయకు కోటి రూపాయలు కూడా వసూలు చేశారట.

అయితే భాదితులు అందించిన సమాచారం ప్రకారం పక్కా వ్యూహం పన్నిన పోలీసులు ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేశారు..అరెస్ట్ అయిన వారిలో దాదాపు 21 మంది తెలంగాణా కి చెందినా వారేనని వారందరూ శ్రీశైలంలో ఆశ్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు పోలీసులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *