ఈ ముగ్గురిలో “లక్” ఎవరికో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయంగా ఎదిగేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్కెచ్ వేశారు. టీడీపి నుండి ఇద్ద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు,  కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నుండి ఒక్కరుకూడా లేకపోవడం తో ఏపిలో బీజీపికి పట్టు పట్టులేదనే కార్యకర్తల వాదనతో ఏకీభవించిన మోడీ  ఏపిలో బీజేపి నుంచీ ఈ సారి  ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

  ఏపిలో బిజెపిని బలోపేతం చేసేందుకు అవసరమైతే దగ్గుబాటి పురందేశ్వరికి మంత్రి పదవి ఇవ్వవచ్చని ఒక ప్రచారం జరుగుతోంది. విశాఖ ఎమ్.పి కంభంపాటి హరిబాబు కూడా రేసులో ఉన్నారు. రామ్ మాదవ్ పేరు  కూడా బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఎవరికీ ఇస్తారు ఎవరికీ ఇవ్వరు అనే విషయం పరిశీలనలో ఉంది అని తెలుస్తోంది.  పురందేశ్వరి బిజెపిలో చేరినప్పుడే ఆమెకు బీజీపీ అధిస్థానం నుండి వచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తారని అనుకుంటే.ఆమెను పదవి ఇవ్వడంలో బాబు అడ్డుపడే అవకాసం ఉంది కావున పురంధరేశ్వరి వైపు మొగ్గు చూపకపోవచ్చు.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, విశాఖ ఎంపీగా గెలుపొందిన హ‌రిబాబుకు కేంద్ర మంత్రి ప‌ద‌వి వచ్చే అవకాశం లేకపోలేదు  నెల్లూరుకు చెందిన వెంక‌య్య‌నాయుడు ఇన్నాళ్లు కేంద్రంలో చ‌క్రం తిప్పారు. ఆయ‌న్ను ఇటీవ‌ల ఉప రాష్ట్ర‌ప‌తిగా పంపించ‌డంతో ఆయ‌న‌లేని లోటును పూడ్చించేదుకు హ‌రిబాబుకు మంత్రిప‌ద‌వి ఇవ్వ‌నున్నారు అని బీజీపీ వర్గాలు చెప్తున్నాయి. మోడీ ఎవరికి అవకాశం ఇవ్వనున్నారో అని ఏపి బీజీపీ నేతలు, ఇటు తెలుగు దేశం కార్యకర్తలు వేచి చూస్తున్నారు

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *