డీఎస్సీ – అభ్యర్దులకి మరో…“గుడ్ న్యూస్”

ఏపీలో ఎంతో మంది డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కొన్ని రోజుల క్రితం అంటే గత నెల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 7,729 పోస్టులను ప్రకటించింది. అయితే ఈ నోటిఫికేషన్ ని అనుగుణంగానే ఈ పోస్టుల సంఖ్య మరింత పెరగనుంది. 7,729 పోస్టులతో పాటు 178 పోస్టులు కలవనున్నాయి. ఇవన్నీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) ఉర్దూ మీడియం పోస్టులే…దాంతో ఇప్పుడు మొత్తం మీద పోస్టుల సంఖ్య 7,907కు చేరుకోనుంది. పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఆగస్టులో 211 ఉర్దూ పోస్టుల భర్తీకి డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనిలో అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా కేవలం 24 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 9 పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి.

Image result for students exams

ఇక, మిగిలిన 178 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు లేనట్లు తేలింది. ఆయా పోస్టులను ఓసీ(జనరల్‌) పోస్టులుగా మార్చారు. వీటిని కూడా ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. తాజా నోటిఫికేషన్‌లో 3,666 ఎస్‌జీటీ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పుడు 178 పోస్టులు వీటికి కలిశాయి…అంతేకాదు  లాంగ్వేజె్‌సలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) పూర్తిచేసిన అభ్యర్థులు కూడా డీఎస్సీ-2018కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభించింది.

Image result for ap dsc

డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌కి సంబంధించి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలను నిర్ధారిస్తూ గత నెల 26న జీ.వో.67 విడుదల చేసిన విద్యాశాఖ..అందుకు అనుగుణంగా కొన్ని సవరణలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు(జీ.వో70) జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌(లాంగ్వేజెస్‌) మరియు లాంగ్వేజ్‌ పండిట్స్‌ (తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒరియా, తమిళ, కన్నడ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. డిగ్రీలో సంబంధిత లాంగ్వేజెస్‌ ఆప్షనల్‌ లేదా మెయిన్‌, ఓరియెంటల్‌ లాంగ్వేజెస్‌ బ్యాచ్‌లర్‌ డిగ్రీతో పాటు ఆయా లాంగ్వేజె్‌సలో పీజీ చేసినా అర్హులే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *