ఏపీలో తొలి రిజల్స్ స్థానం …“వైసీపీ ఖాతాలోకే ”…!!!!
ఏపీలో ఎన్నికల రిజల్స్ కి ఎంతో సమయంలేదు. కొన్ని నిమిషాలలో నేతల జాతకాలు బయట పడనున్నాయి. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపులో మొదటి రిజల్స్ వెలువడే స్థానాలలో మొదటి స్థానం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తెలుస్తోంది. ఈ స్థానం నుంచీ టీడీపీ తరుపున బండారు మాధవ నాయుడు పోటీ పడుతుండగా వైసీపీ తరుపున ముదునూరి పోటీ చేస్తున్నారు. మాధవనాయుడుపై ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకత ఉండటంతో పాటు. టీడీపీ అధినేతపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలగలిపి నరసపురాన్ని వైసీపీకి అప్పగించానున్నాయి. ఇప్పటికే పలు సర్వేలలో సైతం నరసాపురం స్థానం వైసీపీ కైవసం అవుతుందని చెప్పడంతో ఇప్పటికే అక్కడ వైసీపీ శ్రేణులు ఎంతో ఉశ్చాహంగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గ రిజల్స్ కూడా ముందుగానే తెలియనుంది. మొదటి ఫలితం వెలువడే స్థానాలలో రెండు కూడా వైసీపీ పార్టీ గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇదిలాఉంటే కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లున్నాయి. అందువల్ల ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సరళిని, అభ్యర్ధుల గెలుపు ఓటములు ఎప్పటికప్పుడు తమకి సంభందించిన వెబ్సైటు లలో ఉంచుతామని ఎన్నికల కమిషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఫలితాలని తెలుసుకొనేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్సైటు ని కూడా ఏర్పాటు చేసింది. https://results.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాల్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు వోటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా ఫలితాలని పొందవచ్చు