రాజధాని రగడ…హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులు..!!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  జరుగుతున్న రాజధాని సమరంలో రోజుకో రకమైన ఆందోళన మొదలవుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అనుగుణంగా పనులు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూల్ కేంద్రంగా విజిలెన్స్ కమీషన్, కమీషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను మార్చటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

ఈ నేపధ్యంలోనే కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాదు జీ.వో. నెం. 13 చట్ట విరుద్ధమని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ పిటీషన్ ను హైకోర్టు రేపు విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మెన్, సీఆర్డీఏ ను ప్రతివాదులుగా పిటీషనర్ చేర్చారు. కారుమంచి ఇంద్రనీల్ బాబు రైతుల తరపున న్యాయవాదిగా ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *