ఏపీలో నిరుద్యోగులకు మాత్రమే..10th,ఐటిఐ అర్హతతో ఉద్యోగాలు..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్ తెలిపింది. కేవలం 10th, ఐటీఐ అర్హతలతో నెల్లూరులోని టెక్స్టైల్ పరిశ్రమలో ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. మొత్తం 85 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పోస్టుల ఆధారితంగా వారికి జీతాలు ఉండనున్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

APSSDC offers free training in courses

మొత్తం  85 ఖాళీలను నాలుగు విభాగాలుగా భర్తీ చేయనున్నారు.

క్నిట్టింగ్ టెక్నీషియన్ : 28

సీమింగ్ ఆపరేటర్ : 20

క్నిట్టింగ్ ఆపరేటర్ : 35

ఎలక్ట్రీషియన్ : 5

అర్హతలు / జీత భత్యాలు :

క్నిట్టింగ్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఐటీఐ , డిప్లమో అర్హతలు ఉండాలి, అలాగే రెండేళ్ళ అనుభవం తప్పనిసరి, పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. ఇక ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి రూ. 20 వేల జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

సీమింగ్ ఆపరేటర్ ఈ ఉద్యోగానికి పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఎంపిక కాబడిన వారికి రూ. 10వేల జీతంతో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఈ ఉద్యోగానికి అప్ప్లై చేసుకోవచ్చు.

క్నిట్టింగ్ ఆపరేటర్ ఉద్యోగానికి ఐటీఐ , డిప్లమో అర్హతలు ఉండాలి యువతీ యువకులు ఎవరైనా ఉద్యోగానికి  అర్హులు. అలాగే జీతం రూ. 13 వేలు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి

ఎలక్ట్రీషియన్ ఈ ఉద్యోగానికి సుమారు ఐదేళ్ళ అనుభవం ఉండాలి. ఐటీఐ లో ఎలక్ట్రికల్ చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. జీతం రూ. 20 వేలు. వైర్ మెన్ లైసెన్స్ హోల్డర్ మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

 

జాబ్ రిజిస్ట్రేషన్ కోసం

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdbb2dXB6u_XtyCToTPjREwS-EXZSl3xZTHhN7_yR2TvWJ00w/viewform

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *