ట్రంప్ కొంప ముంచేసిన బిల్ గేట్స్..!!!

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ  మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ని అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. కుల, మత , ప్రాంత భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల విద్యావంతులు ఎందరో బిల్ గేట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అమెరికా ప్రజలు గౌరావం ఇస్తారు, ఆయన మాటలకు విలువ ఇస్తారు. అయితే ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకొని బిల్ గేట్స్ కరోనా అమెరికాలో ఎంట్రీ ఇచ్చింది మొదలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలు పెడుతున్నారు.

Bill Gates simulated coronavirus risk last year, with terrifying results

అమెరికాలో మరో నెల రోజుల వ్యవధిలో అంటే నవంబర్ లో ఎన్నికలు ఉన్న తరుణంలో బిల్ గేట్స్ తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కరోనా కారకుడు ట్రంప్ అంటూ మీడియా దుమ్మెత్తి పోస్తుంటే ప్రతిపక్షాలు దాదాపు గల్లా పట్టి బయటకి లాగుతుంటే ఎలా తప్పించుకోవాలి అంటూ వ్యాక్సిన్ అడ్డుపెట్టుకుని దాదాపు ట్రంప్ అమెరికా ప్రజల దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు. అంతా బాగానే ఉందని అనుకుంటున్నా సమయంలో బిల్ గేట్స్ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమెరికాలో ప్రస్తుతం ఉన్న దుర్భరమైన పరిస్థితికి కారణం ట్రంప్, ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bill Gates takes his campaign against “America First” directly to Donald  Trump today - Vox

కరోనా సమయంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వలన వివిధ దేశాలలో ఉన్న ఎంతో అమెరికన్స్ అమెరికా వచ్చారని, అలా వచ్చిన వారిని కనీస పరీక్షలు చేయకుడానే ప్రభుత్వం అమెరికాలోనికి అనుమతి ఇచ్చిందని ఇది పూర్తిగా ట్రంప్ తప్పిదమని వ్యాఖ్యానించారు. కేవలం ట్రంప్ బాధ్యతగా నడుచుకోక పోవడం వలనే అమెరికాలో ఎంతో మంది కరోన కాటుకు బలై పోయారని వ్యాఖ్యానించారు. తాజాగా బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రిపబ్లికన్ పార్టీని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *