నంద్యాల త‌ర్వాత…బాబుకు బీజేపీ చెక్‌..

ఆద్యంతం అత్యంత ఆసక్తిని రేపుతూ, రాజకీయ వేడిని రగులుస్తూ,జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక ఘట్టాలు అన్నీ పూర్తయ్యాయి . ఓటర్లు తన తీర్పును భారీ పోలింగ్ చేసి చూపించారు. దాదాపు రెండున్నర నెలల నుంచి సాగిన నంద్యాల రాజకీయానికి ఓటరు తీర్పును ఇచ్చాడు.అంతా అయిపోయింది ఇప్పుడు మిగిలింది ఓటరు 28 న అంతిమంగా ఇచ్చే తీర్పు. రాజకీయ విశ్లేషకులు నుంచి పాత్రికేయులు వరకూ, సీనియర్ పొలిటీషియన్స్ ,అందరూ వైసీపీ విజయాన్ని ఖరారు చేసేశారట.కానీ ఇప్పుడు వారు చెప్తున్న విషయాలు వింటుంటే టీడీపి నేతల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అదే కనుక జరిగితే 2019 లో టీడీపీకి దిక్కు ఎవరు ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

 విషయంలో కి వెళ్తే. నంద్యాల ఉపఎన్నికల్ని చంద్రబాబు,జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఈ ఫలితాలే 2019 ఎన్నికల దశ, దిశ మార్చేస్తాయి.కానీ ఇక్కడ ఈ ఎన్నికల్ని బీజేపి కూడా చాలా సీరియస్ గా తీసుకుందట.ఎప్పటికప్పుడు తెలుగుదేశ ప్రభుత్వం మీద రిపోర్ట్స్ తెప్పించుకుంటున్న బీజేపి నంద్యాల ఎన్నికల విజయం విషయంలో ఎప్పుడో క్లారిటీ కి వచ్చేసిందని టాక్. పైగా ఏపి ప్రభుత్వం ప్రజలలో విశ్వాసాన్ని పోగొట్టుకోవడం, చంద్రబాబు జాతీయ రాజకీయాలలో ఎంటర్ అవ్వడం, రేపు కేంద్రంలో బాబు బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతాడేమో అనే ఆలోచన, తెలుగుదేశానికి బాబు తరువాత బలమైన నాయకుడు లేకపోవడం. ఇన్ని పరిణామాల నేపధ్యంలో బీజేపి అధిష్టానం చంద్రబాబు కి ముందే చెక్క్ పెట్టే పనిలో పడింది.

chandrababu revanth కోసం చిత్ర ఫలితం

నంద్యాల బై ఎలక్షన్స్ ,కాకినాడ కార్పోరేషన్ లలో టీడీపీ ఓడిపోతే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపి అధికారంలోకి రావడం అయ్యే పని కాదు.ఇదే తరుణంలో చంద్రబాబు ఇమేజ్ ని డామేజ్ చేసి ప్రజలలో మరింత వ్యతిరేకత కలిగేలా వైసీపి బీజేపీతో కలిసి పావులు కదుపుతోంది. ఓటుకు నోటు కేసుని మళ్ళి తెరమీదకు తెచ్చి చంద్రబాబు ని ఇరకాటంలో పడేసేలా స్కెచ్ వేసింది. ఒకవేళ ఇదే జరిగితే చంద్రబాబు ఇమేజ్ డామేజ్ అవ్వడంతో పాటు తెలంగాణా, ఆంధ్రాలోనూ ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *