బ్రేకింగ్ న్యూస్ – “డాలి” దర్సకత్వంలో… “పవన్ కళ్యాణ్”

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించనున్నారా..? అజ్ఞాతవాసి సినిమా తో సినిమాలకి గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ముఖానికి రంగు వేసుకోనున్నారా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు అయితే పవన్ నటించడం మాత్రం నిజమే కానీ అంటూ మెలిక పెడుతున్నారు.. ‘అజ్ఞాతవాసి’ తరువాత పూర్తిగా రాజకీయాలకి దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా యూటర్న్ తీసుకోవడంలో మర్మం ఏమిటి..? అసలు ఎలాంటి సినిమాలో పవన్ నటిస్తున్నారు..? కధ ఎలాంటిది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది..సరే ఇక అసలు విషయంలోకి వెళ్తే..

Image result for pavan kalyan

పవన్ కళ్యాణ్ ఇక వెండి తెరకి కనిపించే అవకాశం లేదని తేలిపోయింది ఈ తరుణంలో పవన్ తాజా సమాచారం ప్రకారం ఆయన మరో మారు మేకప్ వేసుకోబోతున్నారు అని తెలుస్తోంది…పవన్ కళ్యాణ్ మేనల్లుడు..వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు…ఈ సినిమాకి దర్సకత్వం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన వ్యక్తి యాప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు..

Image result for pavan kalyan

అయితే ఈ సినిమా తరువాత దర్శకుడు డాలీతో కలిసి వైష్ణవ్ సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి రామ్ తాళ్లూరి నిర్మాతగా పని చేయనున్నారు…ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఓ గెస్ట్ రోల్ వేయించాలని ప్లాన్ చేస్తున్నారు…ఈ గెస్ట్ రోల్ కూడా అలాఇలా ఉండదట పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది..అయితే పవన్ తన మేనల్లుడి కోసం మాత్రమే కాకుండా దర్శకుడు డాలీ, నిర్మాత రామ్ తాళ్లూరితో ఉన్న బంధం కారణంగా పవన్ నటించడానికి అంగీకరించినట్లు సమాచారం..అయితే ఈ వార్తపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ టాలీవుడ్ లో మాత్రం కోడై కూస్తోంది..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *