“బాబోరిని” భయపెడుతున్న  “ఆ సెంటిమెంట్”

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఈ మధ్య మరీ టెన్షన్ పెరిగిపోతోంది..పడుకున్నా..ఏ పని చేస్తున్నా..కళ్ళు మూసుకున్నా సరే ఆ మూడు మాటలు భూతకాలాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుపై బెంగపెట్టుకునేలా చేస్తున్నాయి. మళ్ళీ ఏమి జరుగుతుందో అధికారం కోల్పోతానా అనే సందిగ్ధత చంద్రబాబు మైండ్ ని తొలిచేస్తోంది..ఇంతకీ ఏమిటా భవిష్యత్తు..? భూతకాలం..? మూడు మాటలు..? అనే ..వివరాలలోకి వెళ్తే..

 Image result for chandrababu naidu fear

“ముందస్తు” ఈ మూడు మాటలే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ని టెన్షన్ పెడుతున్నాయి..గడువు పూర్తి కాకముందే ఎన్నికలకు వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం తెలుపుతున్న దారిలో చంద్రబాబు వెళ్ళాలని అనుకోవడం లేదు ఒకరకంగా చెప్పాలంటే ఆయన ఎంతో టెన్షన్ పడుతున్నారు కూడా  అయితే దానికి కారణంలేకపోలేదు..ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాదించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా మచ్చుకకి కూడా లేవు…తెలుగుదేశం పార్టీకి ముందస్తు ఎన్నికలు పరాజయాన్నే మిగిల్చాయి.

 Image result for chandrababu naidu fear

గతాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే…1983లో ఎన్టీఆర్ ప్రభంజనం అందరికి తెలిసిందే..ఆయన  ప్రభంజనాన్ని.. ఆయన సభలకు దక్కుతున్న జనాదరణతో కంగుతిన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభావాన్ని ముందస్తు ఎన్నికలతో కొంతైనా తగ్గించవచ్చని ఆలోచించిన కేంద్రం అప్పట్లో ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి చావు దెబ్బతింది..ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ సారధ్యంలోని తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది..ఆ తర్వాత 1989లో టీడీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళగా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయింది.

 Image result for chandrababu naidu

2003లో అలిపిరి బాంబు దాడి అనంతరం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని భావించారు…ఆయన దెబ్బలకి ఆయింట్మెంట్ రాసుకుని సెంటిమెంట్ రాజేసి ముందస్తుకి దూకితే  ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది  వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విషయంలో మూడు సార్లు జరిగిన ముందస్తు ఎన్నికలు అధికార పార్టీని ఎంతో ఇబ్బంది పెట్టాయి..ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 Image result for chandrababu naidu

 ముందస్తు జరిగిన ఈ మూడు సార్లు కూడా చంద్రబాబు అధికారంలో ఉండటం గమనార్హం..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళిన సమయంలో ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇలా మూడు సార్లు ఇలాంటి ఫలితాలను స్వయంగా చూసిన ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయడానికి వెనుకాడుతున్నారు అనే చెప్పాలి…అయితే  ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2014, జూన్ 8న అధికారంలోకి వచ్చింది. లెక్క ప్రకారం.. 2019 జూన్ 7వరకూ అధికారంలో ఉండే అర్హత టీడీపీకి ఉంది. కానీ గత అనుభవాలు సెంటిమెంట్లు ద్రుష్టిలో పెట్టుకుని ఏమి జరుగుతుందో వేచి చూడాలి అంటున్నారు టీడీపీ నేతలు..అయితే చంద్రబాబు ముదస్తుకు వెళ్ళే ఆలోచన చేయరు అంటున్నారు విశ్లేషకులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *