కాంగ్రెస్ కి…“చిరు” రాజీనామా..??

కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా టీడీపీ ని ఇంటాబయటా విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఎన్టీఆర్ ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ కి పార్టీ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే చంద్రబాబు ఇక పార్టీని నడపలేక ఒంటరి పోరు చేయలేక కాంగేస్స్ తో  పొత్తు పెట్టుకుని భవిష్యత్తు లో తనకెలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు లేకుండా లైన్ క్లియర్ చేసుకుంటున్నారు…అయితే ఈ పొత్తు కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నేతలు అందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు.

Image result for chiranjeevi meeting

బాబు వెళ్లి రాహుల్ ని కలిసిన రోజునే పశ్చిమ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పార్టీకి రాజీనామా చేసేశారు.. ఇక ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తో కలవడం ఎంతో దారుణమైన విషయమని కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితుల్లో ఉండలేమని పార్టీకి పదవులకి రాజీనామా చేస్తున్నట్టుగా సీనియర్ నేత సి.రామచంద్రయ్య తెలిపారు. అంతేకాదు చంద్రబాబు పాలనకి త్వరలోనే శుభం కార్డు పడుతుందని తీవ్రంగా విమర్శలు  చేశారు…ఇదిలాఉంటే

Image result for tdp congress

రెండు రోజుల్లో చిరజీవి సైతం పార్టీని వీడనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది…గతంలోనే చిరు పార్టీని వీదనున్నారని వదంతులు వచ్చినా చిరు ఎప్పుడూ వాటిని ఖండించిన దాఖలాలు లేవు. అయితే ఎదో ఒక కారణం తో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నచిరుకి చంద్రబాబు కాంగ్రెస్ పొత్తు పెద్ద కారణంగా దొరకడం, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ ఇద్దరు సైతం పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడు చిరు కూడా వారిదారిలోనే అదే ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయడానికి సిద్దమయ్యారట…అయితే రాజీనామా అనంతరం చిరు జనసేనలోకి వెళ్తారా లేక సినిమాలకి పరిమితం అవుతారా అనేది వేచి చూడాల్సిందే.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *