వైసీపీలోకి చిరు… పీకే+జ‌గ‌న్ ఆఫ‌ర్ అదుర్స్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం కొద్ది రోజులుగా నానా తంటాలు ప‌డుతున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. ఆయ‌న జ‌న‌సేన‌లోకి, వైసీపీలోకి, బీజేపీలోకి, టీడీపీలోకి వెళ‌తారంటూ ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలా ఎన్ని వార్త‌లు వ‌చ్చినా చిరు మాత్రం మౌనంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొద్ది రోజుల క్రితం అన్న‌య్య చిరు త‌న పార్టీలోకి రార‌ని ప్ర‌క‌టించారు. దీంతో చిరు జ‌న‌సేన‌లోకి వెళ్ల‌ర‌న్న క్లారిటీ వ‌చ్చేసింది.
నాగ‌బాబు మాత్రం తాను గ‌తంలో అన్న ప్ర‌జారాజ్యం కోసం ప‌నిచేశాన‌ని, ఇప్పుడు త‌మ్ముడుకు సాయం చేస్తాన‌ని చెప్ప‌డంతో చిరు జ‌నసేన‌లోకి వెళ్లినా, వెళ్ల‌క‌పోయినా నాగబాబు మాత్రం త‌మ్ముడు చెంత‌కు చేర‌తాడ‌ని అంద‌రూ క‌న్‌ఫార్మ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం మెగాస్టార్ చిరంజీవి ఏపీలోని విప‌క్ష వైసీపీలోకి వెళ్లేలా రాజ‌కీయం మారుతోన్న‌ట్టు తెలుస్తోంది.
వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసంసర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న వైసీపీ ఇప్పుడు త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించుకుంది. పీకే స‌ల‌హాలను జ‌గ‌న్ తూచా త‌ప్ప‌కుండా ఫాలో అవుతున్న‌ట్టు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పీకే ఏపీలో కాపుల‌ను ద‌గ్గ‌ర చేర్చుకోవాల‌ని జ‌గ‌న్‌కు స్ట్రాంగ్‌గా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.
కోస్తాలో బ‌లంగా ఉన్న కాపులు వైసీపీకి ద‌గ్గ‌ర‌వ్వాలంటే చిరుతో పాటు కాపుల్లో సీనియ‌ర్ల‌ను త‌న పార్టీలో చేర్చుకోవాల‌ని పీకే జ‌గ‌న్ సూచించాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే పీకే డైరెక్ష‌న్‌లోనే చిరు వైసీపీ ఎంట్రీ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు చిరు కోసం జ‌గ‌న్ రాయ‌భారాలు కూడా స్టార్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీలో చేరితే చిరుకు రాజ్య‌స‌భ సీటును రెన్యువ‌ల్ చేసేలా వైసీపీ నుంచి ఆఫర్లు వెళుతున్నాయ‌ట‌. మ‌రి ఈ ఆఫ‌ర్‌కు చిరు ఏం చెప్తాడ‌న్న‌దే ఇప్పుడు స‌స్పెన్స్‌.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *