సీఎం “దత్త పుత్రికకు” వజ్రాల నక్లెస్…!!

తెలంగాణా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష అందరికి గుర్తు ఉండే ఉంటుంది. సవతి తల్లి పెట్టె భాదల కారణంగా దాదాపు మరణం చివరి అంచుల వరకూ వెళ్ళిన ఆమె కేసీఆర్ సాయంతో బ్రతికి బట్టకట్టింది. అధికారుల ద్వారా ఆమె గురించి తెలుసుకున్న కేసీఆర్ ఆమెను దత్తత తీసుకున్నారు. ఆమె పెళ్లి జరిగే వరకూ భాద్యత నాదేనని ప్రకటించారు. ఆమెకు ఇష్టమైన నర్సింగ్ కోర్సు చదివించారు. ఇదిలాఉంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి దూరపు భంధువు చరణ్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కేసీఆర్ తన దత్త పుత్రిక పెళ్లి ఏర్పాట్లు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖకు భాద్యతలు అప్పగించారు..అంతేకాదు

K Chandrasekhar Rao's adopted daughter now a nurse, waits for Telangana CM's call | Hyderabad News - Times of India

కేసీఆర్ సతీమణి స్వయంగా ప్రత్యుషను పెళ్లి కూతురు చేశారు. తమ దత్త పుత్రికకు వజ్రాల హారాన్ని, పట్టు వస్త్రాలను బహుమతిగా ఇచ్చారు. పెళ్లి ఏర్పాట్లను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాధోడ్ , కమిషనర్లు కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం లో ఓ చర్చిలో ప్రత్యూష వివాహం జరగనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *