బీజీపీ ఆపరేషన్ ఆకర్ష్ “ఫస్ట్ వికెట్”..ఎవరంటే..!!!

తెలంగాణ రాష్ట్రంలో మాంచి  ఫామ్ లో ఉన్న బిజెపి మెల్ల మెల్లగా తన పరిధిని విస్తరించాలని భావిస్తోంది. గ్రేటర్  ఎన్నికల్లో గతంలో కంటే కూడా తిరుగులేని ఫలితాలు నమోదు చేసిన బిజెపి పార్టీ భవిష్యత్తులో టిఆర్ఎస్ కు  కంటి మీద కునుకు లేకుండా చేయటంలో  ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు రాజకీయ పండితులు. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా కేవలం బిజెపికి మాత్రమే ఉందని కాంగ్రెస్ తన ఉనికిని కూడా కోల్పోయే స్థితిలోకి చేరుకుందని ఈ గ్రేటర్ ఎన్నికలు సాక్ష్యంగా నిలిచాయి.

TRS slams Jana Reddy, BJP for dual standards

బీజేపీ పార్టీ ప్రస్తుతం ఇదే ఊపును కొనసాగించే  క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలు పెట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్  సీనియర్ నేత జానారెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించినట్టు గా  జానారెడ్డి కూడా ఇప్పటికే బీజేపీతో టచ్లో వెళ్ళినట్లుగా బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను కూడా  ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు డిసెంబర్ 7వ తేదీన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకుని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి జానారెడ్డి దిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది .

BJP Hyderabad civic polls manifesto: Free Covid-19 vaccine and testing, free water, power, promised | Cities News,The Indian Express

గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ క్రియాశీలకంగా మారాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి గనుక విజయం సాధిస్తే మరిన్ని చేరికలు బీజేపీలోకి ఉంటాయని టిఆర్ఎస్ కు చెందిన కొందరు కీలక నేతలు సైతం బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వనిపిస్తోంది. ఏది ఏమైనా బీజేపీ తెలంగాణలో తన జెండా బలంగా పాతడానికి ఇదే కరెక్ట్ సమయంగా భావిస్తోందని అందుకు ఎలాంటి వ్యూహాలు రచించాదానికైనా సిద్దంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *