ట్రంప్ కి తేల్చి చెప్పిన భారత్…మూడో వ్యక్తికి తావు లేదు.

ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు-2020 దావోస్ లో జరుగుతోంది. ఈ సదస్సుకు ఆర్ధిక వేత్తలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ రాజకీయ నాయకులూ, పాత్రికేయులు హాజరై ప్రపంచదేశాల సమస్యలపై చర్చలు జరుపుతారు. ఈ సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాశ్మీర్ ని ఉద్దేశించి మరోసారి కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు లు చేశారు. ఏదోక విషయమై ఎప్పుడూ  వార్తల్లో నిలిచే ట్రంప్ మరో సారి తన వ్యాఖ్యలతో చర్చనీయంశంగా మారారు….

Image result for davos wes 2020 kashmir issue

WES – 2020 సదస్సులో ట్రంప్ పాకిస్థాన్  ప్రధానమంత్రి ఇమ్రాన్ తో భేటీ అయ్యారు. అదే క్రమంలో కాశ్మీర్ విషయమై సాయానికి తాను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారని, కావాలంటే సాయాన్ని అందిస్తానని, కాశ్మీర్ వివాదంలో మేము తప్ప ఇంకెవరు సాయాన్ని అందించలేరని ఘాటుగానే వ్యాక్యానించారు. పాక్ ప్రధాని కూడా ఆయన ప్రసంగంలో కాశ్మీర్ గురించి వినిపించారు. ఐక్యరాజ్యసమితి ఈ విషయమై జోక్యం చేసుకోవాలని ఒక అంతర్జాతీయ మీడియాకి ఇచిన ఇంటర్వ్యూ లో విజ్ఞప్తి చేశారు.

 

ఇదిలాఉంటే , ట్రంప్ సాయాన్ని భారత్ ఎప్పటిలాగే తిరస్కరించింది. ఇంతకుముందు కూడా భారాత్ “ఈ విషయంలో ఎవరి సాయం అవసరం లేదని, ఇది ద్వైపాక్షిక అంశమని ఇందులో మూడో వ్యక్తికి తావు లేదని చెప్పింది”. అదే సమాధానాన్ని భారత్ ఇప్పుడు కూడా తేల్చి చెప్పింది. ఏదేమైనా ట్రంప్ ఇంకో నెలరోజుల్లో భారత్ ను పర్యటించనున్న  సమయంలో ఆయన చేసిన ఇలాంటి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

 

 

 

 

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *