డేరా బాబాకు..20 ఏళ్ళు జైలు శిక్ష

ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్ ను పంచ‌కుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఈ కేసులో గుర్మీత్ కు నేడు శిక్ష ఖరారైంది. గుర్మీత్ కు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. సీబీఐ కోర్టు సోమ‌వారం తీర్పు వెలువరించింది.

సంబంధిత చిత్రం

అయితే అది పదేళ్లు కాదని, 20 ఏళ్లు అతడికి శిక్ష పడినట్టు బాబా తరపు లాయర్ మీడియాకు తెలిపారు. రెండు కేసుల్లో పదేళ్లు చొప్పున మొత్తం 20 ఏళ్లు విధించినట్టు లాయర్ ఎస్‌కే నర్వన తెలిపారు. అంతేకాక ఒక్కో కేసులో రూ.15 లక్షలు చొప్పున రెండు కేసుల్లో మొత్తం రూ.30 లక్షల జరిమానా విధించిందని, బాధితులు ఇద్దరికి చెరో రూ.14 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినట్టు లాయర్ వివరించారు. బాబా ని అదుపులోకి తీసుకున్న సమయంలో అనుచరులు ద్వంసం చేసిన ప్రభుత్వ ,ప్రవైటు ఆస్థుల నష్టాన్ని బాబా ఆస్తుల్ని అమ్మి పరిహారం ఇవ్వాలని,బాబా ఆస్తుల్ని అటాచ్ చేయాలిని కోర్ట్ పోలీసులకి తెలిపింది. ఇప్పటి వరకు పదేళ్లు జైలు మాత్రమే అనుకుంటున్న బాబా భక్తులు,అనుచరులు ఒక్కసారిగా నోళ్ళు వెళ్ళబెట్టారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *