“నందమూరి” అభిమానులకు “పండగ” లాంటి వార్త..

నందమూరి అభిమానులకి పండుగ లాంటి వార్త అరవింద సమేత చిత్ర యూనిట్ తెలిపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి కలయిక కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు ఏమా కధ అంటే..జూనియర్ ఎన్టీఆర్ , బాలయ్య బాబు కలిసి ఇప్పుడు ఒకే వేదికపై కలవనున్నారు.అందుకు అరవింద సమేత విజయోత్సవ సభ వేదిక కానుంది.

Image result for balayya jr ntr

వివరాలలోకి ఇద్దరూ ఒకే వేదికపై కనపడితే చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరనుంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అరవింద సమేత.. వీర రాఘవ’.ఆదివారం విజయోత్సవ సభను నిర్వహించనుంది. శిల్పకళా వేదికగా జరిగే కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లు ముఖ్య అతిథులుగా రానున్నారు.

Related image

అరవింద సమేత అడియో లేదా ప్రీరిలీజ్ ఫంక్షన్ కే బాలయ్య బాబు ముఖ్య అతిథిగా వస్తారని అందరూ అంచనా వేసారు. ఊహాగానాలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు అరవింద సమేత విడుదల తరువాత జరుగుతున్న తొలి భారీ సక్సెస్ మీట్ కు బాలకృష్ణ హాజరవుతున్నారు..ఈ కన్నుల పండుగ కోసం ఎంతో మంది అభినానులు వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *