పెళ్ళికొడుకు తండ్రితో వెళ్ళిపోయిన పెళ్లి కూతురి తల్లి..!!

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ప్రజలు. వివాహ నిశ్చయం విషయం లో తల్లితండ్రుల సంతోషాన్ని, నిర్ణయాన్ని గౌరవించే పిల్లలు ఎంతో మంది ఉంటారు, అదే విధంగా పిల్లల సంతోషం కోసం వారి ఇష్టాలను వదులుకున్న తల్లితండ్రులు లెక్కలేనంతమంది. పెళ్లి వయసు పిల్లలు ఉండి, అదికూడా వారికీ పెళ్లి అవుతుండగా ప్రేమించిన వారితో తల్లి, తండ్రి వెళ్ళిపోవటం అనేది ఎంతో దారుణమైన ఘటన. ఇలాంటి ఓ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది… అసలు వివరాలోకి వెళ్తే..

 

గుజరాత్ లోని కటార్ కు చెందిన ఓ వ్యక్తి (48), నవ్సారీ కి చెందిన వివాహిత మహిళా (46) గతంలో ఇరుగు పొరుగు ఇళ్ళలో నివసించేవారు. పక్కపక్కన ఇల్లు అవటం తో మంచి స్నేహం కూడా ఏర్పడింది. వివాహితకు పెళ్లి వయసు కూతురు, పక్క ఇంటి వ్యక్తికి పెళ్లి వయసు కొడుకు ఉన్నారు. మంచి స్నేహం ఉండటంతో ఆ పిల్లలిద్దరికి వివాహం చేస్తే బాగుంటుందని ఇరు వర్గాల పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్ళికి ఫిబ్రవరి లో తేదీ కూడా నిర్ణయించారు. పెళ్లి పనులు కూడా చకా చకా సాగుతున్నాయి.. ఈలోగా జరిగిన ఓ సంఘటన….

 

వరుడి తండ్రి తో, వధువు తల్లి వెళ్ళిపోవటమనే ఉహించని ఘటనతో ఇరు కుటుంబ సభ్యులు, ఆ వధు, వరులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జనవరి 10 నుంచి వరుడి తండ్రి, అదే రోజు నుంచి వధువు తల్లి కనిపిచకపోవాటంతో, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగ గతంలో వారు ఒకరినొకరు ఇష్టపడ్డారని, ఆ కారణంగానే ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి ఉంటారని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

  

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *