yash emotional gandadha gudi event

“గంధద గుడి” ప్రీ రిలీజ్….ఎమోషనల్ అయిన KGF హీరో “యశ్”  

కన్నడ సినిమా  ను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్ళిన కేజిఎఫ్ సినిమా అంతే స్థాయిలో ఆ సినిమా హీరో యశ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండు భాగాలుగా విడుదలయ్యి యాక్షన్, సెంటిమెంట్ కలయికగా వచ్చిన ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఇదిలాఉంటే ఈ సినిమా హీరో యశ్ ఎమోషనల్ అయిన ఘటన ఆయన ఫ్యాన్స్ ను కలవర పెట్టింది.

Puneeth Rajkumar's last film Gandhada Gudi to release on October 28 | The  News Minute

పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆయన ఫ్యాన్స్ ఎంతగా బాధపడ్డారో అంతే బాధను ఆయనకు మంచి మిత్రుడు అయిన యశ్ అనుభవించారు. పునీత్, యశ్ ఇద్దరూ  ఎంతో మంచి మిత్రులు. యశ్ కు ఇండస్ట్రీ లో పునీత్ మంచి సపోర్ట్ కూడా ఇచ్చేవారట. ఈ నేపధ్యంలో వారి స్నేహం మరింత బలంగా మారింది. పునీత్ చివరి చిత్రం జేమ్స్ ఆయన మరణం తరువాత రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే…అయితే

పునీత్ నటించిన మరో చిత్రం “గంధద గుడి”  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 28 న విడుదలచేసేందుకు సినిమా యూనిట్ సిద్దమవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తాజాగా యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు కర్ణాటక సీఏం , సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై హీరో యశ్ మాట్లాడుతూ పునీత్ కు తనకు ఉన్న భందాన్ని గుర్తు చేసుకున్నారు. తన చిత్రం కేజిఎఫ్ రికార్డ్స్ ను గంధద గుడి సినిమా  బ్రేక్ చేయాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ సినిమాను పునీత్ రాజ్ కుమార్ సతీమణి పునీత్ అశ్విని నిర్మించడం గమనార్హం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *